Kumari Aunty vs Politics : ఫుట్‌పాత్ మీద మీల్స్ స్టాల్ పెట్టుకునే కుమారి ఆంటీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ న్యూస్ టాపిక్ అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన పాపులారిటీ రావడం, ఆమె బండి దగ్గర మీల్స్ చేయడం సెలబ్రిటీలు కూడా క్యూ కట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని సాయి కుమారి ఆంటీ మీల్స్ స్టాల్‌ని తొలగించారు పోలీసులు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, కుమారి ఆంటీ స్టాల్‌ని అక్కడే పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చాడు..
ఓ రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద బండి పెట్టుకునే ఆవిడ కోసం ముఖ్యమంత్రి స్వయంగా చొరవ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చిన సాయికుమారి ఆంటీ మీల్స్ స్టాల్ మీద ఆంధ్రా రాజకీయాలు టర్న్ తీసుకున్నాయి. కుమారి ఆంటీ హోటల్ బిజినెస్‌ని జగన్ తీసి వేయించాడని, చంద్రబాబు ఫోన్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి మళ్లీ ఆమెకు హోటల్ పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చాడని.. టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది.
జగన్ స్వయంగా ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి చెప్పడం వల్లే సాయికుమారి ఆంటీ వ్యాపారం మొదలైందని, ఆంధ్రావాళ్లు ఎక్కడున్నా ఆదుకునే అన్న మా జగన్ అన్న అంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. తాను ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే ఓటు వేస్తున్నా అని చెప్పిన సాయికుమారి ఆంటీ, జగన్ అన్న ప్రభుత్వం వచ్చాక తనకు సొంత ఇల్లు కట్టించి ఇచ్చిందని చెప్పి.. రెండు పార్టీల ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. ఫుట్‌పాత్ మీద ఉండే సాయికుమారి ఆంటీ వ్యాపారం, టూ స్టేట్స్ పాలిటిక్స్‌లో భాగం కావడం మామూలు విషయం కాదు.
Remembering Suryakantham : తెరపై గయ్యళి అయస్కాంతం.. తెరవెనుక మనస్కాంతం..