Sai Kumari Aunty Food Stall : సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకుని, సెలబ్రిటీ మారిపోయింది రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ నిర్వాహకురాలు కుమారీ ఆంటీ. ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ దగ్గరికి వచ్చే జనాల సంఖ్య వేలల్లో పెరిగింది. చాలామంది ఫుడ్ తినడానికి కాకుండా ఆమెతో ఫోటోలు దిగడానికే వస్తున్నారు. ఇలా వచ్చేవారి కారణంగా రద్దీగా ఉండే మాదాపూర్ మెయిన్ రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ఈ ట్రాఫిక్ జామ్‌కి సాయికుమారి ఆంటీ ఫుడ్ స్టాలే కారణమని గమనించిన ట్రాఫిక్ పోలీసులు, అక్కడ బిజినెస్ చేయవద్దని హెచ్చరించారు. అక్కడ స్టాల్ పెట్టకుండా తీసేయించారు. ఈ విషయం తెలుసుకున్న సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ వంటి సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలిచారు. చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజాగా ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుమారి ఆంటీ బిజినెస్‌ని టచ్ చేయవద్దని డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా త్వరలో రేవంత్ రెడ్డి, సాయి కుమారి ఆంటీ స్టాల్‌ని సందర్శించి… నెలకు లక్షన్నర మాత్రమే సంపాదిస్తున్న ఆమెకు సాయంగా హోటల్ పెట్టుకునేందుకు ఉచితంగా స్థలం కూడా ఇవ్వబోతున్నారట..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ని పట్టించుకోని పవన్ కళ్యాణ్.. ప్రాజెక్ట్ పక్కనబెట్టేసిన హరీశ్ శంకర్..
ఈ విషయం తెలిసి సామాన్యులు షాక్ అవుతున్నారు. ఫుట్ పాత్ మీద తిండి తిప్పలు లేకుండా పడుకునే అభాగ్యుల గురించి పట్టించుకోకుండా నెలకు లక్షన్నర లాభం మిగులుతుందని ప్రకటించిన వ్యాపారి కోసం స్వయంగా సీఎం సాబ్ కదలడం చూస్తుంటే.. పబ్లిసిటీయే ప్రధాన ప్రాయారిటీ అనే సూత్రం గుర్తుకువస్తుందని అంటున్నారు సామాన్యులు..