Captain Miller Movie Review : సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అంటే మాస్ కమర్షియల్ సినిమాలు చేసి ఉంటే, ఈపాటికి కోలీవుడ్ సూపర్ స్టార్ అయ్యేవాడు ధనుష్. అయితే మిగిలిన హీరోల్లా కాకుండా ప్రతీ సినిమాకి వేరియేషన్ చూపిస్తూ, కథా బలం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు ధనుష్. ప్రతీ సినిమాతో తనలోని నటుడికి పరీక్ష పెడుతూనే ఉన్నాడు. ధనుష్ చేసిన తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ కూడా ఆ కోవకు చెందినదే..
Padma Awards 2024 : చిరంజీవికి ‘పద్మవిభూషణ్’.. ఏఎన్నాఆర్ తర్వాత రెండో తెలుగు నటుడిగా..
బ్రిటీష్‌వారి ఉక్కుపాదాల కింద దేశం నలిగిపోతున్న సమయంలో భారతీయుల్లో పుట్టిన స్వాతంత్ర్య కాంక్ష, స్వేచ్ఛా పోరాటం, తిరుగుబాటు దీని చుట్టూ ‘కెప్టెన్ మిల్లర్’ కథ తిరుగుతుంది… ప్రపంచానికే దారి చూపే విజ్ఞానం సొంతం చేసుకున్నా, అంటరాని కులం, కులం, మతం పేరుతో కొట్టుకుంటున్న భారతీయులను బ్రిటీష్ వాళ్లు ఎలా 200 ఏళ్లు పాలించగలిగారు? ఈ పాటింగ్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించాడు దర్శకుడు..
కథ చాలా సినిమాల్లో చాలా సార్లు చూసిందే. అయితే చూపించి విధానంలోనే దర్శకుడి క్రియేటివిటీ ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కించిన విధానం, దాన్ని డబుల్ చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు.. థియేటర్‌లో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయి…
ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసిన డైరెక్షన్, సినిమాని కూడా అంతే పకడ్బందీగా కట్ చేశాడు. తొలి అరగంట సినిమా పాత్రలను పరిచయం చేసి, ప్రేక్షకులను కథలో లీనం అయ్యేలా చేసిన డైరెక్షన్.. ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్, ధనుష్ క్యారెక్టర్‌తో మరో రేంజ్‌కి చేర్చాడు. ధనుష్ లాంటి గొప్ప నటుడికి తగ్గ పాత్ర దొరికితే చెలరేగిపోతాడు. ‘కెప్టెన్ మిల్లర్’ అలాంటి కథే..
Balakrishna : హనుమాన్ డైరెక్టర్‌తో బాలయ్య బాబు.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే..
సందీప్ కిషన్, శివ రాజ్‌కుమార్, ప్రియాంక మోహన్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. కాస్త తమిళ నెగిటివిటీ టచ్ ఉన్నప్పటికీ, యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ ‘కెప్టెన్ మిల్లర్’ తప్పకుండా నచ్చుతుంది.. తమిళ్‌లో రూ.100 కోట్లకు చేరువైన ‘కెప్టెన్ మిల్లర్’, తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించడం ఖాయమే!