Fighter Movie review : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రివ్యూ: అనుకున్నదానికంటే ఎక్కువే…
‘సూపర్ 30’, ‘వార్’ తర్వాత మూడేళ్లు బ్రేక్ తీసుకుని, ‘విక్రమ్ వేద’ మూవీ చేశాడు హృతిక్ రోషన్. తమిళ్ ఒరిజినల్ కంటే బాగుందనే రివ్యూలు వచ్చినా సుశాంత్ సుసైడ్ తర్వాత నెపోటిజంపై బాలీవుడ్ ఫ్యాన్స్ తిరుగుబాటు కారణంగా ఆ మూవీ హిట్ కాలేకపోయింది. రెండేళ్ల తర్వాత ‘ఫైటర్’ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హృతిక్ రోషన్..
దీపికా పదుకొనే, అనిల్ కపూర్ నటించిన ‘ఫైటర్’, జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిప్లబిక్ డేకి ఒక్కరోజు ముందే విడుదలైన ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల పెద్దగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు…
ఇది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన కథ. ట్రైలర్లో చూపించినట్టే ఎయిర్‌ఫోర్స్ జవాన్లు చేసే యుద్ధ విన్యాసాలే ఈ మూవీకి ప్రధాన హైలైట్. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్కి ఇది మరో సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి నుంచి కథ కంటే కమర్షియల్ హంగులనే ఎక్కువగా నమ్ముకోవడం సిద్ధార్థ్‌కి అలవాటు. ‘పఠాన్’ మూవీలోనూ ఈ ఫార్ములా బాగానే వర్కవుట్ అయ్యింది..
‘ఫైటర్’లో వాయు విన్యాసాలకు తోడు కాస్త డ్రామా, ఎమోషన్స్.. దేశభక్తి జోడించి, ఫ్యాన్స్ ఆశించినదానికంటే ఎక్కువే ఇచ్చాడు సిద్ధార్థ్.. హృతిక్ రోషన్‌కి ఇలాంటి విన్యాసాలు చేయడం కొత్తేమీ కాదు. మరోసారి తన స్టైల్లో స్క్రీన్ మీద సూపర్ షోతో చెలరేగిపోయాడు హృతిక్. దీపికా పదుకొనే యాక్టింగ్, అందాలు ‘ఫైటర్’కి స్పెషల్ అట్రాక్షన్. అనిల్ కపూర్, కరణ్ సింగ్, అక్షర్ ఓబెరాయ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సంచిత్ బల్హరా, అంకిత్ బల్హరా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది..
విశాల్ శేఖర్ పాటలు కూడా ఇప్పటికే మంచి సక్సెస్ సాధించాయి. పాటల్లో దీపికా పదుకొనే గ్లామర్ షో, ‘పఠాన్’ని మించిపోయింది. సంచిత్ పాలోస్ సినిమాటోగ్రఫీ, ఈ మూవీని మరో స్థాయికి చేర్చింది. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఫైటర్’ మూవీ, ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకి వెళ్లిన వారికి మాస్ మసాలా కమర్షియల్ హంగులన్నీ అందించడం పక్కా!
Tapsee pannu : యానిమల్’ లాంటి సినిమాల్లో నేనైతే నటించను