Sankranthi Movies 2024 : సంక్రాంతి 2024కి ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్ల గురించి పెద్ద గొడవే జరిగింది. అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లు కూడా ‘గుంటూర్ కారం’ మూవీకి ఇచ్చేశారని నిర్మాతల మండలిని ఆశ్రయించింది మైత్రీ మూవీ మేకర్స్.. మంచి సినిమాని ఎంత పెద్ద అడ్డంకి కూడా అడ్డుకోలేడని నిరూపిస్తూ… ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం క్రియేట్ చేస్తోంది.
Hanuman Vs Guntur Kaaram : గుంటూర్ కారం మూవీకి షాక్ ఇచ్చిన హనుమంతుడు..
మొదటి మూడు రోజులు, థియేటర్లు ఇవ్వకుండా ‘హనుమాన్’ని నైజం ఏరియాలో చాలా తక్కువ థియేటర్లలో నడిపించేలా చేయగలిగారు. అయితే ఇది కూడా ‘హనుమాన్’ మూవీపై క్రేజ్ మరింత పెరిగేలా చేసింది. నాలుగో రోజు నుంచి ‘హనుమాన్’ థియేటర్ల సంఖ్య భారీగా పెరిగింది. అమెరికాలో ‘హనుమాన్’ కలెక్షన్లు, ‘గుంటూర్ కారం’ కంటే భారీగా ఉన్నాయి.
Prashanth Varama : హనుమాన్ సక్సెస్ అయితే, అవతార్ రేంజ్‌లో మూవీ తీస్తా… ప్రశాంత్ వర్మ కామెంట్స్…
‘హనుమాన్’ మూడో రోజు 800K డాలర్లు వసూలు చేస్తే, ‘గుంటూర్ కారం’, 200K డాలర్లు కూడా రాబట్టలేకపోయింది. అలాగే హైదరాబాద్‌లో 256 షోస్ హౌస్‌ఫుల్‌గా నడుస్తుంటే, ‘గుంటూర్ కారం’ 412 షోస్‌లో 50 షోస్ మాత్రమే ఫుల్ అయ్యాయి. ‘గుంటూర్ కారం’ కంటే నాగ్ ‘నా సామి రంగ’ మూవీకి కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చిన ‘నా సామి రంగ’ మూవీకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి.