Indra Re Release : మెగాస్టార్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మళ్లీ థియేటర్లలోకి వస్తున్న ఇంద్రసేనా రెడ్డి..

Indra Re Release : ఇప్పుడంటే మెగాస్టార్ చిరంజీవి, ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’, ‘ఆచార్య’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలు చేస్తూ ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాడు కానీ.. 15 ఏళ్ల కిందట అసలు మెగాస్టార్ స్థాయి వేరు.. ఓ ‘గ్యాంగ్ లీడర్’, ఓ ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’, ఓ ‘ఇంద్ర’, ఓ ‘ఠాగూర్’ వంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

హద్దుల్లేని ప్రేమ.. ఆమె కోసం అతడిగా మారి.. చివరకు విషాదాంతమై..

అలాంటి వింటేజ్ చిరుని మళ్లీ చూడాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది వైజయంతి మూవీస్. 1974లో స్థాపించిన వైజయంతి మూవీస్ సంస్థకు వచ్చే ఏడాదితో 50 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా 2002లో విడుదలైన ‘ఇంద్ర’ మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నారు.

ఈ ఏడాది రీ-రిలీజ్‌ల ట్రెండ్ అద్భుతంగా సాగింది. ‘సింహాద్రి’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘అదుర్స్’, ‘ఈ నగరానికి ఏమైంది’ ఇలా స్టార్లతో సంబంధం లేకుండా అనేక సినిమాలు, మళ్లీ 4k వెర్షన్‌లో థియేటర్లలోకి వచ్చాయి. డిసెంబర్ 30న విడుదలైన ‘వెంకీ’ రీ-రిలీజ్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

లేడీ అసిస్టెంట్‌తో హాలీవుడ్ హీరో పాడు పని! 13 ఏళ్ల తర్వాత కేసు..

రాయలసీమలో ఫ్యాక్షనిజం రూపుమాపాలని ప్రయత్నించే ఇంద్రసేనా రెడ్డిగా, కాశీలో కారు నడుపుకునే శంకర్ నారాయణగా మెగాస్టార్ చిరంజీవి నటనకు అప్పట్లో జనాలు నీరాజనాలు పలికారు. అప్పటిదాకా ఉన్న బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులన్నీ కొల్లగొట్టిన ‘ఇంద్ర’, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ‘దాయి దాయి దామ్మా’ అంటూ చిరూ వేసిన స్టెప్పులు, ‘మొక్కే కదా పీకేస్తే.. పీక కొస్తా’ అనే పవర్ ఫుల్ డైలాగులు… 22 ఏళ్ల తర్వాత కూడా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. ‘ఇంద్ర’ రీ-రిలీజ్‌లో థియేటర్లలో ఈ సీన్స్‌కి మోత మోగిపోవడం గ్యారెంటీ..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post