Rakul Preet Singh and Jackky Bhagnani : రెండేళ్ల క్రితం వరకూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది రకుల్ ప్రీత్ సింగ్… ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, ‘ధృవ’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘స్పైడర్’, ‘మన్మథుడు 2’ ఇలా ఐదేళ్ల పాటు వరుస సినిమాలు చేసింది. అయితే రెండేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్‌కి తెలుగులో సరైన అవకాశాలు దక్కడం లేదు.
జైలు శిక్ష అనుభవిస్తూ పీజీలో గోల్డ్ మెడల్.. నీ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్..
వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడిపోయిన రకుల్ ప్రీత్ సింగ్, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో కొన్నాళ్లుగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్, ఫిబ్రవరి 22న గోవాలో అతన్ని వివాహం చేసుకోబోతుందట. ఈ పెళ్లికి రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రెండ్స్ మంచు లక్ష్మీ ప్రసన్న, ప్రగ్యా జైస్వాల్ వంటి కొందరితో పాటు అతి కొద్ది మంది బంధు మిత్రులకు మాత్రమే ఎంట్రీ ఉంటుందట.
సలార్ మూవీకి ప్రభాస్ రెమ్యూనరేషన్..
ఫిట్నెస్ మీద అధిక శ్రద్ధ పెట్టిన రకుల్ ప్రీత్, జిమ్‌కి సమయం సరిపోవడం లేదని షూటింగ్‌కి చాలా లేటుగా వెళ్లేదని వార్తలు వచ్చాయి. రకుల్ ప్రీత్‌కి ఛాన్సులు తగ్గిపోవడానికి ఇది కూడా ఓ కారణం. పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, పూర్తిగా సినిమాల నుంచి తప్పుకోబోతుందని తెలుస్తోంది. 2023లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా ‘బూ’ (Boo). ఈ ఏడాది తమిళ్లో ‘అయాలన్’, ‘ఇండియన్ 2’ సినిమాలు చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి అయిపోయింది.