జరగండి ఏమైంది శంకర్ జీ.. దీపావళికి అన్నారు, క్రిస్‌మస్‌కి కూడా వచ్చేలా లేదే!

Ram Charan Game Changer Movie : RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ‘గేమ్ ఛేంజర్’ని మొదలెట్టాడు శంకర్. దీంతో అటు అది, ఇటు ఇది రెండూ కూడా ఎటూ తేలడం లేదు. కొన్నాళ్లు ‘గేమ్ ఛేంజర్’, మరికొన్ని రోజులు ‘భారతీయుడు 2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు శంకర్..

గొర్రెతనం పోలేదహే! అమర్‌దీప్, అశ్విని కార్లతో పాటు ఆర్టీసీ బస్సుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి..

అప్పుడెప్పుడో దసరా టైమ్‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించిన ఓ పాట సోషల్ మీడియాలో లీకైంది. ‘జరగండి జరగండి జాబిలమ్మ జాకెట్ వేసుకుని వచ్చేస్తోంది’ అని సాగే ఈ పాట, సోషల్ మీడియాలో ప్రత్యేక్షం కావడంతో దీపావళికి అఫిషియల్‌గా పాట రిలీజ్ ఉంటుందని ప్రకటించింది చిత్ర యూనిట్. దీపావళి వచ్చింది, వెళ్లింది కానీ ‘జరగండి జరగండి’ పాట రిలీజ్ మాత్రం జరగలేదు..

నాడు ఎన్టీఆర్, నేడు మెగాస్టార్, మరి రేపు..!?

క్రిస్‌మస్ వచ్చేస్తున్నా, ఇంకా ‘జరగండి’ పాట రిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ మూవీకి ఎస్. తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ‘గుంటూర్ కారం’ మూవీ రీ-రికార్డింగ్ పూర్తి చేసే పనిలో తమన్ యమా బిజీగా ఉండడంతో చరణ్ మూవీ సాంగ్ రిలీజ్ వాయిదా పడిందట. సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.. సినిమా రిలీజ్‌పై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post