1983 World Cup History : క్రికెట్ అంటే ఇండియాలో ఒక ఆట మాత్రమే కాదు అది ఒక ఎమోషన్. వందకోట్ల భారతీయులను ఏకతాటిపైకి తెచ్చే శక్తి క్రికెట్ కి ఉంది. ఇండియా.. ఇండియా.. అనే నినాదాలతో స్టేడియంలో చొక్కాలు చించుకొంటారు. మన దేశంలో క్రికెట్ ఇష్టపడని వారు చాలా అరుదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరు క్రికెట్ ప్రేమికులే. భారత క్రికెట్ చరిత్రలో మరపురాని క్షణాల్లో 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఒకటి. టోర్నమెంట్‌కు ముందు, భారతదేశం బలమైన పోటీదారిగా పరిగణించలేదు. ఎందుకంటే అప్పటి వరకు ప్రపంచ కప్‌ను గెలవలేదు.
ముంబైలో ‘మాస్టర్’ రికార్డులు బ్రేక్..
వెస్టిండీస్ మరియు ఆస్ట్రేలియా వంటి క్రికెట్ పవర్‌హౌస్‌లతో పోలిస్తే ఇండియాను అండర్‌డాగ్‌లుగా పరిగణించారు. ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్ లో 1983 లో జూన్ 9 నుండి జూన్ 25 వరకు జరిగింది. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు కొన్ని అద్భుతమైన విజయాలను సాధించింది. అయితే అప్పటికే ఛాంపియన్‌గా ఉన్న వెస్టిండీస్ చేతిలో లీగ్ మ్యాచ్ లో 125 పరుగులకే ఆలౌట్ కావడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎదురుదెబ్బ నుంచి భారత జట్టు పుంజుకుని నాకౌట్‌కు చేరుకుంది.
1983, జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్‌లో ఇండియా టీం మళ్లీ బలమైన వెస్టిండీస్‌తో తలపడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను త్వరగా కోల్పోయి 5 వికెట్ల నష్టానికి 17లే చేసింది. ఈ సమయంలో పరిస్థితి గందరగోళంగా కనిపించి, ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలనే భారత్ కల జారిపోతున్నట్లు అనిపించింది. ఈ టైం లోయర్ ఆర్డర్ విలువైన సహకారంతో భారత్ 6 వికెట్లకు 183 పరుగుల స్కోర్ ను చేసింది.
184 పరుగుగుల స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా చేధించొచ్చు అనుకున్న వెస్టిండీస్ ను కట్టుదిట్టమయిన బౌలింగ్ తో 52 ఓవర్లకు (అప్పట్లో వన్డేలకు 60 ఓవర్లు ఉండేవి) 140 పరుగులకే అలౌట్ చేసి విజయకేతనం ఎగురవేసింది. 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం భారతదేశమంతటా ఆనందోత్సాహాల రేకెత్తించింది. లక్షలాది మంది అభిమానులు చారిత్రాత్మక విజయాన్ని జరుపుకున్నారు. 1983 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయం, భారత క్రికెట్‌కు మొదటి విజయ ఘట్టం. ఇది క్రికెట్ చరిత్రలో నూతన విజయ శకానికి నాంది పలికింది.
Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..
దేశంలో క్రీడల పట్ల మక్కువను రేకెత్తించింది. భారతదేశం ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో పోటీపడి ఓడించగలదని నిరూపించింది. జనాదరణ పెరగడానికి, క్రికెట్ జాతీయ అభిరుచిగా మారడానికి దారి తీసింది. 1983 ప్రపంచ కప్ విజయం భారతీయ క్రీడా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ క్షణాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఇది 2011 మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో వరల్డ్ కప్ విజయంతో సహా భవిష్యత్ విజయాలకు పునాది వేస్తూ.. భారత క్రికెట్‌కు ఒక మలుపుగా మిలిపోయింది.