YouTuber Gunti Nagaraju : సోషల్ మీడియా ప్రపంచంలో పాపులారిటీ తెచ్చుకోవడం చాలా ఈజీ. అయితే వచ్చిన పాపులారిటీ వాడుకుని, సక్సెస్ సాధించడమే చాలా కష్టం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఉరఫ్ శిరీష.. సోషల్ మీడియా నుంచి బీభత్సమైన మద్ధతు వచ్చింది. అయితే ఎన్నికల్లో మాత్రం 5700+ ఓట్లు మాత్రమే సాధించిన శిరీష, డిపాజిట్ కూడా కోల్పోయింది.
ఓటు వేయమంటే వేయలేదు కానీ మిస్ యూ కేటీఆర్ అంటూ సోషల్ మీడియా పోస్టులు..
అలాగే ఖమ్మం నుంచి యూట్యూబ్ స్టార్ గుంటి నాగరాజు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే అతనికి మొత్తంగా 54 ఓట్లు మాత్రమే పడడం విశేషం. వ్యవసాయం చేసే వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న గుంటి నాగరాజు, ఆ తర్వాత వంటలను కూడా పోస్ట్ చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత తన ఇంట్లో, ఊర్లో జరిగే ప్రతీ విషయాన్ని వీడియో తీసి, యూట్యూబ్‌లో పెట్టే గుంటి నాగరాజుకి 2 లక్షల 70 వేల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు.
ఖమ్మం జిల్లాలోని రఘనాథ పాలెం మండలంలోని కోయచెలక గ్రామానికి చెందిన గుంటి నాగరాజుకి కూడా విజిల్ గుర్తుని కేటాయించింది ఎలక్షన్ కమిషన్. బషీర్ మాస్టర్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కనీసం లక్ష ఓట్లు వస్తాయన ఛాలెంజ్ చేశాడు గుంటి నాగరాజు… అయితే రిజల్ట్ మాత్రం వేరేగా వచ్చింది. మొత్తంగా గుంటి నాగరాజుకి కేవలం 54 ఓట్లు మాత్రమే వచ్చాయట..
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మరీ, బంపర్ మెజారిటీతో గెలిచాడు.. అందరూ దీన్నే ఫాలో అయితే..
తనకి 54 ఓట్లు వచ్చాయని, తన వంతుగా ఎన్నికల్లో నిలబడి నీతిగా, నీజాయితీగా ప్రయత్నించానని… మిగిలిన వాళ్లు ఓటుకి రూ.7 వేలు ఇచ్చి, ఓటర్లను కొనుక్కున్నారని, కనీసం నా ఫ్యామిలీ అయినా నాకు ఓటు వేసిందో లేదో తెలియదని నాగరాజు గోడు వెల్లబుచ్చుకుంటూ యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేశాడు..