Yoga day 2024 : భారతదేశంలో మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకుంటారు. ప్రపంచానికి యోగా నేర్పిన ఘనత కూడా మన దేశానికే దక్కుతుంది. అయితే ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా.? జూన్ 21నే యోగా డే జరుపుకోవడానికి గల కారణాలేంటో చూద్దాం..
భారతదేశంతో యోగాకు ఉన్న అనుబంధం వేదాలు పుట్టు కాలం నుంచి ఉంది . భారతీయ సంస్కృతి మరియు వేదాలలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేడు, ప్రపంచం మొత్తం యోగా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుందంటే, దానికి ముఖ్య కారణం భారతదేశంలోని యోగా గురువులు. వీరి కృషి వల్లే యోగా ప్రపంచం నలుమూలల వ్యాపించింది. అసలు విషయంలోకి వస్తే..
Indian Students in Abroad : కోటి ఆశలతో విదేశాలకు వెళ్లి, విగతజీవులుగా తిరిగి వస్తూ..
యోగా డే ఎలా ప్రారంభమైందంటే..
2014 సెప్టెంబర్ 27న మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. అదే సంవత్సరంలో, డిసెంబర్ 11, 2014న, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ ప్రతిపాదనను ఆమోదించింది మరియు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు 177 దేశాల మద్దతు లభించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా 21 జూన్ 2015న మొదటిసారి యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ రోజున, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు సామూహికంగా యోగా సాధన చేశారు.
యోగా డే జూన్ 21నే ఎందుకు..
జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. వాస్తవానికి, జూన్ 21 ఉత్తర అర్ధగోళంలో సుదీర్ఘమైన రోజు. ఈ రోజును సంవత్సరంలో సుదీర్ఘమైన రోజుగా పిలుస్తారు. అంటే ఈరోజు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలం తరువాత, సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. ఇది యోగా మరియు ఆధ్యాత్మికతకు ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. అందుకే జూన్ 21ని యోగా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.