Yatra 2 Vs Rajadhani Files : ఏపీ పాలిటిక్స్ చుట్టూ మూడు సినిమాలు..

Yatra 2 Vs Rajadhani Files : దేశ, అంతర్జాతీయ రాజకీయాల కంటే ఏపీ పాలిటిక్స్ భలే ఆసక్తికరంగా సాగుతున్నాయి.. నిన్న మొన్నటివరకూ వైసీపీకి ఈసారి అధికారం దక్కడం అనుమానమేనని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈసారి కూడా వైసీపీదే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు, వైసీపీ కాంగ్రెస్‌కి బలం పెంచాయి. కేవలం డైరెక్ట్ రాజకీయాల్లోనే కాదు, సినిమా పాలిటిక్స్‌లోనూ ఏపీ పాలిటిక్స్ హవా సాగుతోంది.

Animal Controversy : నీ కొడుకు వెబ్‌ సిరీస్‌లో బూతులు పెట్టి, నాకు నీతులు చెబుతావా..!?

వైఎస్ జగన్ బయోపిక్‌ ఆధారంగా ‘యాత్ర 2’ రూపొందిస్తున్నాడు మాహీ వీ రాఘవ్… ఈ మూవీ నిండా జగన్ భజన, వైఎస్ఆర్ భజన ఉండబోతుందని ట్రైలర్, టీజర్‌లోనే తెలిసిపోయింది. ఇప్పుడు దానికి కౌంటర్‌గా ‘రాజధాని ఫైల్స్’ పేరుతో మరో సినిమా వస్తోంది. తెలుగు వన్ ఛానెల్ ఎండీ రవిశంకర్ కంఠమనేని నిర్మిస్తున్న ‘రాజధాని ఫైల్స్’లో, జగన్ తీసుకొచ్చిన ‘మూడు రాజధానుల’ పాయింట్‌నే ప్రధానంగా తీసుకున్నారు. కేవలం చంద్రబాబు అభివృద్ధి చేసిన అమరావతిని రాజధానిగా పెట్టడం ఇష్టం లేకనే, జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినట్టుగా ‘రాజధాని ఫైల్స్’ మూవీలో క్లియర్‌గా చూపించేశారు.

Poonam Pandey Death : చావుతో జోక్స్ ఏంటి పాప..!

అలాగే గుడివాడ రౌడీగా ఎమ్మెల్యే నాని మాట్లాడే బూతులను కూడా చూపించేశారు. మూడు రోజుల క్రితం విడుదలైన ‘యాత్ర 2’ ట్రైలర్‌కి ఇప్పటిదాకా 4.6 మిలియన్ల వ్యూస్ వస్తే, నిన్న విడుదలైన ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్‌కి ఇప్పటికే 7 మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి. ‘యాత్ర 2’ మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతుంటే, ‘రాజధాని ఫైల్స్’ మూవీ ఫిబ్రవరి 15న వస్తోంది. ఏపీ పాలిటిక్స్ మీదే ఆర్జీవీ తీసిన వ్యంగ్యాస్త్రం ‘వ్యూహం’ మాత్రం కోర్టు కేసులతో వాయిదా పడిన విషయం తెలిసిందే..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post