Yash Toxic Movie : కరీనా కపూర్ అవుట్!

Yash Toxic Movie : ‘కేజీఎఫ్’ మూవీ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యశ్. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, Toxic అనే సినిమా అనౌన్స్ చేశాడు. గే లవ్ స్టోరీ ‘మూథోన్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ మూవీకి డైరెక్టర్. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, శృతి హాసన్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించబోతున్నారని టాక్ వినిపించింది. కరీనా కపూర్ హీరోయిన్ కాదని, హీరోకి అక్కగా కనిపించబోతుందని టాక్…

అయితే సినిమా షూటింగ్ మొదలైన తర్వాత క్రియేటివ్ డిఫెరెన్సులతో ఈ ప్రాజెక్ట్ నుంచి కరీనా కపూర్ తప్పుకుందట. ఈ సినిమాలో కరీనా కపూర్ చేసే క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని, స్వలింగ సంపర్కుల గురించి ఇందులో సీన్స్ ఉన్నాయని, అందుకే ‘బేబో’ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్ వినబడుతోంది.

కేజీఎఫ్‌కి ముందు యష్ ఎవడు? అల్లు అరవింద్ కామెంట్..

కరీనా కపూర్ ప్లేస్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకోవాలని ప్రయత్నిస్తోంది డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్. నయనతార ఈ మధ్యకాలంలో చేసిన ‘అన్నపూరణి’ సినిమా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ సినిమా లవ్ జిహాద్‌ని ప్రొత్సహించే విధంగా ఉందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని కేసులు నమోదు అయ్యాయి.

థియేటర్లలో ఈ సినిమాని పట్టించుకోని జనం, ఓటీటీలో చూసిన తర్వాత కేసులు పెట్టారు. దీంతో ఓటీటీ నుంచి ఈ మూవీని తొలగించింది నెట్‌ఫ్లిక్స్.. దీంతో నయనతార స్వయంగా క్షమాపణలు చెప్పింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘టాక్సిక్’ మూవీలో నటించడానికి నయన్ అంగీకరిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ…

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post