జగనన్న వేరు, సీఎం జగన్ వేరు! మా అన్నను మిస్ అవుతున్నా..
2024 ఏపీ ఎన్నికల ముందు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో వచ్చిన చీలికలు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ’ పెట్టి, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది వైఎస్ షర్మిల. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ షర్మిల, అన్నకు వ్యతిరేకంగా పోటీ చేస్తుందని, అన్న వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.. చివరికి జగన్ తల్లి విజయమ్మ కూడా కూతురుకే మద్ధతుగా నిలిచింది..
‘నేను మా అన్నను నిజంగా మిస్ అవుతున్నా. ఆయన నా రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్య. అయితే నాకు తెలిసిన జగనన్న వేరు, సీఎం జగన్ వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసమో, లేక ఆస్తి కోసమో నేను, అన్నతో గొడవ పెట్టుకోలేదు.. నాకు ఓ పోస్ట్ కావాలని ఎప్పుడూ అడగలేదు..
జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నది ప్రజల కోసం! కనీసం ఏపీకి ప్రత్యేక హోదా తేలేకపోయారు. కనీసం పోరాటం చేయలేకపోయారు. రైతులకు న్యాయం చేయలేకపోయారు. మద్యపాన నిషేధం విషయంలో కూడా జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అందుకే జగన్‌కి వ్యతిరేకంగా పోరాటం చేశాను..
నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు జరిగింది. ఇప్పటికీ న్యాయం జరగలేదు. బాబాయ్ కోసమే ఇక్కడ నిలబడ్డాను. అవినాశ్ రెడ్డి పోటీ చేయకపోతే నేను పోటీ చేయకపోయేదాన్ని.. ఓ హత్య కేసులో సంబంధం ఉన్న A1 మరోసారి చట్టసభలోకి పోకూడదని నేను, పోరాటం చేస్తున్నా..
ప్రస్తుతం అమ్మ, నా కొడుకు, కోడలుతో అమెరికాలో ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి నేను నిలబడడం ఇష్టం లేదు. నేనే అధిష్టానాన్ని ఒప్పించి, నిలబడ్డాను. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని బలపరచడం నా కర్తవ్యం.. ’ అంటూ చెప్పుకొచ్చింది వైఎస్ షర్మిల..