World Kidney Day : కిడ్నీ సమస్యల నుంచి ఇలా కాపాడుకోండి..

World Kidney Day : నీటి కాలుష్యం, మినరల్ వాటర్ కోసం వాడే క్లోరిన్, వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాలు.. ఎలా కారణాలేమైనా కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలు వచ్చేస్తున్నాయి.. అయితే కొన్ని చిట్కాలతో కిడ్నీలను క్లీన్‌గా ఉంచుకోవచ్చు.

1. ఫిట్‌గా ఉండడం..
ఏ ఆరోగ్య సమస్యనైనా ఎదుర్కోవడానికి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ఫిట్ లైఫ్ స్టైల్‌ని అలవర్చుకోవడం వల్ల కిడ్నీ సమస్యలతో ఈజీగా పోరాడవచ్చు.

Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..

2. బ్లడ్ షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం..
50 శాతాని కంటే ఎక్కువగా ఉండే డయాబెటిస్ వల్ల కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. కాబట్టి కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే చక్కెర లెవెల్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి.

3. బ్లడ్ ప్రెషర్‌ని నియంత్రించుకోవడం..
హై బ్లడ్ ప్రెషర్‌ కారణంగా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరగకుండా జాగ్రత్త పడాలి.

4. డైట్ ఫాలో అవ్వాలి..
ఉప్పు, కారం తక్కువగా తీసుకుంటూ ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం వల్ల కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు.

5. నీళ్లు ఎక్కువగా తాగడం..
సగానికి పైగా ఆరోగ్య సమస్యలు నీళ్లు సరిపడా తీసుకోకపోవడం వల్లే వస్తాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలను కాపాడుకోవచ్చు.

6. స్మోకింగ్‌కి దూరంగా ఉండడం..
కిడ్నీ, ఊపిరితిత్తులు చెడిపోవడానికి ప్రధాన కారణం పొగ త్రాగే అలవాటు. మీతో పాటు మీ పక్కవారికి చేటు చేసే స్మోకింగ్ అలవాటును మానేయడం వల్ల కిడ్నీల ఆయుష్షు, మీ ఆయుష్షు పెంచుకోవచ్చు.

రక్తహీనత లక్షణాలు.. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

7. ధ్యానం..
ధ్యానం చేయడం వల్ల చాలా మానసిక, శారీరక సమస్యలు తగ్గుతాయి. ధ్యానం వల్ల అనవసర ఆలోచనలు తగ్గి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లోకి వచ్చి.. కిడ్నీల ఆరోగ్యం మెరగవుతుంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post