World Cup Effect : ‘Rx100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన కొత్త సినిమా ‘మంగళవారం’ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసిన ‘మంగళవారం’, రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టింది. అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో తొలి వీకెండ్‌లో సగానికి పైగా షేర్ వస్తుందని ఆశించారంతా..
ఈ మాత్రం దానికి ఇన్ని ఎలివేషన్స్ బొక్క.. ఫైనల్‌లో టీమిండియా చిత్తు! వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వశం..
అయితే టీమిండియా, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ చేరడంతో ఆ ఎఫెక్ట్, ఆదివారం వసూళ్లపై తీవ్రంగా పడింది. ఆదివారం ఆంధ్రాలో చాలా థియేటర్లలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని లైవ్ టెలికాస్ట్ చేశారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు జనం ఇళ్లకు అతుక్కోపోవడంతో వసూళ్లు 80 శాతానికి పైగా పడిపోయాయి..
‘మంగళవారం’ చిత్రాన్ని దాదాపు రూ.13 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది చిత్ర యూనిట్. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టాలంటే వీక్ డేస్ వచ్చే కలెక్షన్లు కీలకంగా మారబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. దీపావళికి విడుదలైన సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ వరల్డ్ కప్ ఫైనల్ రోజున కనీసం రూ.1 కోటి షేర్ కూడా వసూలు చేయలేకపోయింది.
పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ రివ్యూ: కసితో తీసిన థ్రిల్లర్..
నవంబర్ 12న దేశవ్యాప్తంగా విడుదలైన ‘టైగర్ 3’, దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. అయితే ఫుల్ రన్ ముగిసే సమయానికి కూడా రూ.300 కోట్ల షేర్ వసూలు చేయడం అసాధ్యం మారింది. సల్మాన్ కెరీర్‌లో మరో డిజాస్టర్ చేరినట్టే.