World Cup 2023 Final : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు ఫైనల్ దాకా, ఒక్క ఓటమి కూడా లేకుండా వెళ్లింది. అయితే టైటిల్ కోసం గెలవాల్సిన ఫైనల్ ఒక్క మ్యాచ్‌లో మాత్రం చేతులు ఎత్తేసింది. ఈ ఓటమి తర్వాత భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో విచార వదనాలు అలుముకున్నాయి. ఒక్క ప్లేయర్ ముఖంలో కూడా జీవం లేదు.
ఇలాంటి సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మిగిలిన ప్లేయర్లను కలిసి వారితో కరచాలనం చేస్తూ ఓదార్చాడు. ‘మీరు 10 మ్యాచుల్లో గెలిచి, ఫైనల్‌కి వచ్చారు. అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 100 కోట్ల మంది చూస్తున్నారు. నవ్వండి’ అంటూ భారత జట్టులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
ఈ మాత్రం దానికి ఇన్ని ఎలివేషన్స్ బొక్క.. ఫైనల్‌లో టీమిండియా చిత్తు! వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వశం..
అయితే అసలే ఫైనల్‌లో ఓడిన బాధతో మేం ఉంటే, ఇలా మోదీ వచ్చి, పబ్లిసిటీ స్టంట్స్ చేయడం ఏంటన్నట్టుగా శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ ఫేసుల్లో ఎక్స్‌ప్రెషన్స్ కనిపించాయి. నిజంగా ఓదార్చాలని అనుకుంటే, ఇంత హంగూ ఆర్భాటం అవసరం లేదని, కేవలం దీన్ని ఓ ప్రచార సాధనంగా వాడుకోవాలనే ఉద్దేశంతో కెమెరాని చూసి మాట్లాడుతూ ‘ఓదార్పు యాత్ర’ చేసినట్టుగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.