Women Passenger traffic increases in TSRTC buses : జనాలు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారు. అది ఇండియన్ అయినా, అమెరికన్ అయితే ఫ్రీ విషయంలో పెద్దగా తేడా ఉండదు. తెలంగాణ మహిళలు కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. మహిళలకు బస్సు ప్రయాణాలు ఉచితం అనేసరికి… పని ఉన్నా, లేకపోయినా, తక్కువ దూరం అయినా, నడిచేంత దగ్గరే అయినా బస్సు ఎక్కేస్తున్నారు ఆడాళ్లు.
ఇంతవరకూ బస్సు ఎప్పుడూ ఎక్కని వాళ్లు కూడా ఫ్రీగా ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో అనుభవం చేసేందుకు బస్సు బాట పడుతున్నారు. ఫలితంగా డిసెంబర్ 9 నుంచి 3 రోజుల్లో బస్సుల్లో ప్రయాణించిన మహిళల సంఖ్య 60 శాతం పెరిగింది.
ఇంతకుముందు బైకుల్లో, ఆటోల్లో, ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్స్‌ల్లో బుక్ చేసుకున్న వారంతా ఇప్పుడు ఫ్రీ బస్సు ఎక్కేస్తున్నారు. సోమవారం బస్సు ప్రయాణం చేసిన వారి సంఖ్య 51 లక్షలు ఉంటే వారిలో 30 లక్షలకు పైగా మహిళలే ఫ్రీగా బస్సు ఎక్కేశారట. ఇంతకుముందు ఈ సంఖ్య 20 లక్షలు కూడా ఉండేది కాదు.. ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల ఒక్క సోమవారమే ఆర్టీసీకి 9 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. సంక్రాంతి హాలీడేస్ వస్తుండడంతో ఆర్టీసీకి కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం తెచ్చిపెట్టనుంది ఈ మహిళలకు ఫ్రీ బస్ పథకం..
నాని ‘హాయ్ నాన్న’ సినిమాని తొక్కేస్తున్న దిల్ రాజు..