Wipro Ex CEO Thierry Delaporte : విడాకులు తీసుకున్న తర్వాత భార్యకి భరణం చెల్లించడం చాలా కామన్. ఏళ్ల తరబడి సర్వీస్ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ మొత్తం ఇవ్వడం కూడా చూసి ఉంటాం. కానీ భారతీయ ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో, తన మాజీ సీఈవోకి ఏకంగా రూ.92.1 కోట్ల మొత్తం చెల్లించనుంది. థియరీ డెలాపోర్టేని అర్ధాంతరంగా సీఈవో పొజిషన్ నుంచి తప్పించింది విప్రో. అయితే కాంట్రాక్ట్‌లో భాగంగా కారణం చెప్పకుండా బాధ్యతల నుంచి తప్పించినందుకు గానూ, 12 నెలల శాలరీ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఓ నియమాన్ని కూడా జోడించింది విప్రో..
Nora Fathehi : డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటారు, డిప్రెషన్‌లోకి వెళ్తారు..
వచ్చే 14 నెలల కాలంలో థియరీ డెలాపోర్టే ఏ కంపెనీలో ఉద్యోగానికి చేరకపోయినా, లేదా ఏ కంపెనీని సొంతంగా మొదలెట్టకపోయినా అతనికి నష్టపరిహారంగా రూ.92.1 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది విప్రో సంస్థ. ఇంతకుముందు 2023లో మరో భారత ఐటీ సంస్థ TCS మాజీ సీఈవో రాజేశ్ గోపీనాథన్‌కి నిష్కమణ ఒప్పందం కింద రూ.48 కోట్లు చెల్లించింది. అలాగే కాగ్నిజెంట్ మాజీ CEO బ్రియాన్ హంఫ్రీస్ కూడా తన పొజిషన్ నుంచి తప్పుకునే సమయంలో రూ.55 కోట్లకు పైగా మొత్తాన్ని అందుకున్నాడు..
సీఈవో పొజిషన్‌లో ఉన్నవాళ్లకు ఉద్యోగంలో ఉన్నా కోట్లు, ఊడినా కోట్లు వస్తుంటే.. కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు మాత్రం రూ.15-20 వేల జీతం కోసం వెట్టి చాకిరి చేయాల్సి వస్తోంది. ఇదే విప్రో సంస్థలో ఉద్యోగానికి అప్లై చేసి రిజెక్ట్ చేయబడడంతో ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించాడు ఎన్.ఆర్ నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి, ఉద్యోగులు వారినికి 70 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.