Why Do Movies Release On Fridays : స్కూల్ పిల్లలకు, ఆఫీసులకు వెళ్లేవారికి ఆదివారం అంటే ఇష్టం. కానీ సినీ ప్రియులకు మాత్రం శుక్రవారం చాలా స్పెషల్. ఎందుకంటే శుక్రవారం వచ్చిందంటే ఏదో ఓ సినిమా థియేటర్లలోకి రావాల్సిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా శుక్రవారం రోజునే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి? శుక్రవారం రిలీజ్ అయితే శనివారం, ఆదివారం వీకెండ్స్ కలిసి వస్తుంది. సెలవులు కావడంతో థియేటర్లకి వచ్చే జనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది ఓ రీజన్.. అయితే దీని వెనకాల ఇంకా చాలా కారణాలు ఉన్నాయి..
Tollywood : తెలుగు సినిమాకు ‘టాలీవుడ్’ అనే పేరు ఎలా వచ్చింది..!?
నిజానికి శుక్రవారం విడుదల సంప్రదాయం హాలీవుడ్ నుంచి వచ్చింది. హాలీవుడ్ పాపులర్ మూవీ ‘Gone with the Wind’ మూవీ 1939, డిసెంబర్ 15 శుక్రవారం రోజున విడుదలైంది. ఆ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో శుక్రవారం మహాలక్ష్మీకి ప్రీతిపాత్రమైన రోజు అని హిందువుల నమ్మకం. అలాగే ముస్లింలకు కూడా శుక్రవారం ప్రత్యేకం. గుడ్ ఫ్రైడే జరుపుకునే క్రిస్టియన్లకు కూడా శుక్రవారం స్పెషలే..
దీంతో హాలీవుడ్ ఆనవాయితీని బాలీవుడ్ కూడా కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఇండియాలో శుక్రవారం రిలీజ్ అయి, అఖండ విజయం అందుకున్న మొదటి సినిమా ‘Moghal-E-Azam’. ఈ సినిమా 1960, ఆగస్టు 5న విడుదలైంది. బాక్సాఫీస్ రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా కారణంగా శుక్రవారం విడుదల సంప్రదాయం, భారత సినీ రంగానికి ఫిక్స్ అయిపోయింది.
Tollywood Heros Tags : హీరోలకు ‘స్టార్’ ట్యాగ్‌ల పిచ్చి.. ఆఖరికి శర్వానంద్ కూడా తగిలించుకున్నాడుగా..
అదీకాకుండా ఇంతకుముందు రోజువారీ కూలీలకు వారానికి ఓ సారి వేతనం ఇచ్చేవాళ్లు. అది కూడా శుక్రవారం ఇచ్చేవాళ్లు. ఆ రోజు చేతుల్లో డబ్బులు ఉండడంతో సినిమాకి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు థియేటర్లకు రోజురోజుకీ అద్దె చెల్లించే విధానం ఉండేది. మిగిలినరోజులతో పోలిస్తే శుక్రవారం అద్దె తక్కువగా ఉండేది. నిర్మాతలు శుక్రవారం రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించడానికి ఇది కూడా ఓ కారణం.. అలా శుక్రవారం అంటే సినిమా రిలీజ్, సినిమా రిలీజ్ అంటే శుక్రవారం అన్నట్టుగా మారింది..