Vishwak Sen Gaami : మార్చి రెండో వారం ‘శివరాత్రి’ కానుకగా థియేటర్లలోకి మూడు సినిమాలు వస్తున్నాయి. ఇందులో విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ మూవీతో పాటు గోపిచంద్ నటించిన ‘భీమా’, మలయాళ డబ్బింగ్ క్యూట్ లవ్ స్టోరీ ‘ప్రేమలు’ ఉన్నాయి. ఇందులో ‘గామి’ సినిమాకి బీభత్సమైన క్రేజ్ వచ్చింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ఎస్.ఎస్.రాజమౌళి ట్వీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ప్రమోషన్ కార్యక్రమాలన్నీ ‘గామి’ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ‘గామి’ టాప్‌లో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ వస్తే, వీకెండ్లో ఈజీగా రూ.15-20 కోట్ల వరకూ రాబట్టవచ్చు..
Vishwak Sen Gaami : విశ్వక్ సేన్ సినిమాకి A సర్టిఫికెట్.. గామి ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తుందా..
సినిమా సగటు ప్రేక్షకుడు పెట్టుకున్న అంచనాలను అందుకోగలిగితే, ఫుల్ రన్లో రూ.50 కోట్ల క్లబ్లో చేరడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అలాగే ‘రామబాణం’ డిజాస్టర్ తర్వాత గోపిచంద్ చేసిన సినిమ ‘భీమా’. ఈ మూవీ ట్రైలర్ కూడా బాగుంది. సోషల్ ఫాంటసీ ప్లస్ పోలీస్ యాక్షన్ సినిమాగా రూపొందింది ‘భీమా’. ట్రైలర్ కట్ అదిరిపోయేలా ఉన్నప్పటికీ ఈ సినిమాపై ఎగ్జామ్స్ సీజన్ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే ‘గామి’, ‘భీమా’ రెండు సినిమాలకు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చినా, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తోంది..
‘భీమా’ మూవీకి అనుకున్న రేంజ్లో ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ రావడం లేదు. ఇక మలయాళంలో రూ.100 కోట్ల వైపు పరుగులు పెడుతున్న ‘ప్రేమలు’ మూవీ, తెలుగులో డబ్ అయ్యి, మార్చి 8న రిలీజ్ అవుతోంది. రాజమౌళి కొడుకు ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి కూడా అనుకున్నట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. అయితే ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది..
Pushpa 2 : బన్నీ – సుక్కు కాంబోకి దిమ్మతిరిగే ఆఫర్..
ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతే, ‘ప్రేమలు’ మూవీకి రెస్పాన్స్ పెరగొచ్చు.. ఎటొచ్చీ కమ్‌బ్యాక్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్, అనుకున్న రిజల్ట్ దక్కించుకోవాలంటే సోషల్ మీడియా నుంచి బొమ్మ అదిరిపోయిందనే రెస్పాన్స్ రావాల్సిందే..