మరోసారి వాయిదా పడిన విక్రమ్ ‘ధృవ నక్షత్రం’… వెంటాడుతున్న సమస్యలు..

Vikram’s ‘Dhruva Natchathiram’ postponed again : గౌతమ్ వాసుదేవ్ మీనన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ధృవ నక్షత్రం’. సూర్యతో 2013లో మొదలైన ఈ మూవీ, ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 24న విడుదల అవుతుందని ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఈసారి కూడా ‘ధృవ నక్షత్రం’మూవీకి మోక్షం కలగలేదు. విడుదలకు ముందు ఫైనాన్షియల్ సమస్యలు తలెత్తడంతో ‘ధృవ నక్షత్రం’మూవీని మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్..

బాలయ్యని టార్గెట్ చేస్తున్న కోలీవుడ్.. విచిత్ర కామెంట్స్ తర్వాత రాధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్..

స్పై థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో రూపొందిన ‘ధృవ నక్షత్రం’ మూవీకి సరైన ప్రమోషన్ కూడా చేయలేదు. అయితే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌, హీరో విక్రమ్ ఫ్యాన్స్ చాలామంది ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. మూవీ విడుదల వాయిదా పడడంతో టికెట్ డబ్బులను రిఫండ్ చేస్తున్నారు.

Vikram's 'Dhruva Natchathiram' postponed again

క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ హారీజ్ జయ్‌రాజ్ సంగీతం అందించిన ‘ధృవ నక్షత్రం’ మూవీ, 2017లో రూ.60 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం లెక్క రూ.150 కోట్లను దాటిపోయింది. హీరో విక్రమ్ కూడా ‘ధృవ నక్షత్రం’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదు. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కీ, విక్రమ్‌కీ మధ్య వచ్చిన విబేధాలే దీనికి కారణమని తెలుస్తోంది.

ప్రియాంక మోహన్ ‘లవ్’లో ప్రభాస్.. ఆ ఇద్దరికీ బ్రేకప్..

‘ధృవ నక్షత్రం’ మూవీకి ముందు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ తెరకెక్కించిన ‘తూటా’ మూవీ కూడా ఇలా వాయిదాలు పడుతూ విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. శింబుతో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమాని రెండు పార్టులుగా ప్లాన్ చేసిన గౌతమ్ మీనన్, వరుణ్ అనే తమిళ యువహీరోగా చేసిన ‘జోషువా ఇమై పోల్ కకా’ మూవీ కూడా మూడేళ్లుగా వాయిదా పడుతూనే ఉంది… ఈ రెండు సినిమాలకు ఎప్పుడు మోక్షం దక్కుతుందోనని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post