Vijayashanti : మొదటి నుండి నిర్మాణాత్మకమైన ఉద్యమాలు అలవాటైన మనస్తత్వానికి.. ప్రజా క్షేత్రంలో మరింత దూకుడుగా పోరాటాలు చేయాల్సిన అవసరముందని చాలాసార్లు అనిపిస్తోంది. మా పార్టీ హైకమాండ్ అనుమతించిన తర్వాత కూడా ఎందుకో నేను ముందుకు వెళ్లలేకపోతున్నాను. తెలియని కారణాలతో నా కార్యాచరణలో మార్పులు సంభవిస్తున్నాయి అంటూ ప్రస్తుత రాజకీయాల్లో తన పాత్రను విశ్లేషించుకునే పనిలో పడ్డారు.
లార్డ్ కృష్ణ మంత్రాలు నేర్చుకుంటున్న అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు..
స్వతహాగా ఉద్యమ మనస్తత్వమే అయినప్పటికీ, కార్యక్రమాలకు పార్టీ హైకమాండ్ సైతం అనుమతించినప్పటికీ.. తాను చేపట్టాలనుకున్న ప్రజాపోరాట యాత్రలు అనుకోని కారణాలవల్ల రద్దు కావడం, కార్యాచరణలో ఊహించని విధంగా మార్పులు జరగడం ఎందుకు సంభవించాయో అర్థం కావడం లేదని విజయశాంతి వాపోయారు.
ఫైర్ బ్రాండ్, మళ్లీ పాత గూటికి చేరనున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీని అభిమానిస్తామని పేర్కొన్నారు విజయశాంతి. బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి సమర్థించారు. దీంతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయశాంతి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆమె బహిరంగంగానే వ్యతిరేకించారు.
సొంత పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి.. తర్వాతి కాలంలో టీఆర్ఎస్ లో చేరడం, ఆమె ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ కల సాకారం కావడం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఫలితాల తర్వాత క్రమంగా పొలిటికల్ యాక్టివిటీ తగ్గించి, మళ్లీ సినిమాల బాట పట్టారు ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చిపడ్డాయి.
దీంతో ఆమె సినిమాలకే పరిమితం అవుతారా? మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ అవుతారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయశాంతి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆమె బహిరంగంగానే వ్యతిరేకించారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని విజయశాంతి తప్పు పట్టారు.
కిషన్ రెడ్డి రాష్ట్ర బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించడంపైనా ఆమె తీవ్రంగా స్పందించారు. ఇక పార్టీ కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందడం లేదన్న అసంతృత్తిలో రాములమ్మ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాములమ్మ సైతం కాంగ్రెస్ గూటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అమె సినీ వినీలాకాశంలో మెరిసిన అరుణకిరణం.
స్కూల్స్ బంద్.. బండ్లు రోడ్లు ఎక్కాలంటే రూల్.. ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి..
ధుర్యోధన, దుశ్శాసన దుర్వినీతిని ఎండగట్టి రేపటి పౌరులకు నీతి పాఠాలు చెప్పిన టీచర్ ఝాన్సీ, కర్తవ్యంతో సమాజంలో స్పూర్తినింపిన నటి. ఉద్యమ నేపథ్యాన్ని రగిలించిన రాములమ్మ. చరిష్మా ఉన్న నటి, ఆమె సామర్థ్యాన్నీ ఏ రాజకీయ పార్టీ సముచితంగా వినియోగించుకుంటుందో చుడాలి. సినీరంగంలో అమె స్థాయి, వేరు రాజకీయ రంగంలో అమెకుదక్కుతున్న స్థానం వేరు. సమ్యమనంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిద్దాం..