Vijay Deverakonda – Sai Pallavi : విజయ్ తో సాయి పల్లవి! అప్పుడు మిస్ అయ్యింది కానీ..

Vijay Deverakonda – Sai Pallavi : విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇప్పుడు అర్జెంట్‌గా విజయ్‌కి ఓ కమర్షియల్ సక్సెస్ అవసరం. అందుకే ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీ తర్వాత లేటు చేయకుండా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. అప్పుడెప్పుడో సుకుమార్‌తో మూవీ ఉంటుందని అనౌన్స్‌మెంట్ వచ్చింది, అయితే అది దాదాపు అటకెక్కినట్టే. దీంతో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్లతో కాకుండా కంటెంట్ ఉన్న కథలతో మెప్పించాలని అనుకుంటున్నాడు..

Allu Arjun Vs Ram Charan : బన్నీ ఫాలోయింగ్ ముందు తేలిపోయిన చెర్రీ క్రేజ్..

‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, ‘ట్యాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్‌తో ఇంకో మూవీ అనౌన్స్ చేశాడు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించబోతుందని టాక్ వినబడుతోంది. ‘శ్యామ్ సింగరాయ్’లో దేవదాసి రోజీగా, సాయి పల్లవి కోసం ఓ మంచి పాత్ర రాశాడు రాహుల్ సాంకృత్యాన్. ఇప్పుడు విజయ్ దేవరకొండతో మూవీలోనూ హీరోయిన్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని, దానికి సాయి పల్లవి అయితే బాగా సెట్ అవుతుందని అనుకుంటున్నారట..

నిజానికి విజయ్ దేవరకొండ చేసిన ‘డియర్ కామ్రేడ్’ మూవీలో ముందు సాయి పల్లవినే హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే లిప్‌లాక్ సీన్స్ చేయడానికి సాయి పల్లవి ఒప్పుకోకపోవడంతో ఆ క్యారెక్టర్‌ని రష్మిక మంధాన చేసింది. అప్పుడు మిస్ అయిన విజయ్ దేవరకొండ- సాయి పల్లవి జోడి, ఇప్పుడు సెట్ అవుతుందా? ఈసారి కూడా మిస్ అవుతుందా? త్వరలోనే తేలిపోనుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్న సాయి పల్లవి, తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో ‘తండేల్’ మూవీ చేస్తోంది..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post