Victory Venkatesh Birthday Special : బిగ్ బాస్ టీవీ ప్రోగ్రామ్ ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో గత సీజన్లకు పెద్దగా టీఆర్పీ దక్కకపోయినా సీజన్ 7కి మంచి రేటింగ్ వస్తోంది. ఒకవేళ టాలీవుడ్ మొత్తాన్ని బిగ్‌బాస్‌గా అనుకుంటే.. సేఫ్ గేమ్ ప్లేయర్‌గా దగ్గుబాటి వెంకటేశ్ నిలుస్తాడు. అత్యధిక విజయాల శాతం ఉన్న టాలీవుడ్ హీరో వెంకీ, ‘విక్టరీ’నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఇదేనా..
మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ‘స్వర్ణ కమలం’ ‘ప్రేమ’, ‘ధర్మచక్రం’, ‘కలిసుందాం రా’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు గెలిచిన వెంకటేశ్, తన కెరీర్‌లో ఎక్కువగా చేసింది రీమేక్ సినిమాలే..
హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్టైన సినిమాలను రీమేక్ చేసి, తెలుగులోనూ సూపర్ హిట్లు సాధించాడు. తన కెరీర్‌లో 75 సినిమాలు చేసిన వెంకీ, దాదాపు సగం రీమేక్స్ చేశాడు. వెంకీ చేసిన ‘అబ్బాయి గారు’, ‘కొండపల్లి రాజా’, ‘చంటి’, ‘సుందరకాండ’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘వసంతం’, ‘ఘర్షణ’, ‘సంక్రాంతి’, ‘గురు’ వంటి సినిమాలు మంచి విజయాన్ని అందించాయి.
‘కేజీఎఫ్ 3’ కథ రెడీ! కానీ డైరెక్టర్ నేను కాదు… పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..
గత ఐదారేళ్లలో వెంకీ చేసిన ‘గోపాల గోపాల’, ‘గురూ’, ‘నారప్ప’, ‘ఓరి దేవుడా’, ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’, ‘దృశ్యం 2’ కూడా రీమేక్ చిత్రాలే. రెండోతరంలో వెంకీ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యామిలీ ఆడియెన్స్, ముఖ్యంగా ఆడాళ్లు థియేటర్లకు క్యూ కట్టేవాళ్లు. వెంకీ కూడా సినిమా సెలక్షన్ విషయంలో తన ఫ్యాన్స్ ఫీల్ అవ్వకుండా సెంటిమెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వచ్చాడు. అయితే ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేసి వెంకీ ఆ ఫాలోయింగ్‌ని కాస్త దెబ్బ తీసుకున్నాడు.