సైంధవ్ రివ్యూ: గురి సరిగ్గా కుదరని థ్రిల్లర్.. వెంకీ 75th మూవీకి అదే ప్లస్..

సైంధవ్ రివ్యూ
సైంధవ్ రివ్యూ

సైంధవ్ రివ్యూ : విక్టరీ వెంకటేశ్ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్’. గత డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సిన ‘సైంధవ్’ మూవీ, ప్రభాస్ ‘సలార్’ మూవీ కారణంగా వాయిదా పడి జనవరి 13న రిలీజ్ అయ్యింది. HIT చిత్రాల సిరీస్‌కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను, ‘సైంధవ్’చిత్రానికి దర్శకుడు.

90’s – A Middle Class Biopic : డైరెక్టర్‌గా తొక్కేసినా, నిర్మాతగా సూపర్ సక్సెస్..

కథ విషయానికి వస్తే.. సైంధవ్ ఓ సింగిల్ పేరెంట్. తన కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. సడెన్‌గా ఓ రోజు తన కూతురు ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తనకు ట్రీట్‌మెంట్ ఇప్పించాలంటే రూ.17 కోట్లు కావాలని చెబుతారు డాక్టర్లు. ఆ డబ్బు కోసం తాను అజ్ఞాతం వీడి, తిరిగి తన చీకటి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు.

వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధికీ), పోర్టులో ఉన్న తన కంటైనర్స్‌ని తెచ్చి ఇచ్చేందుకు సైకో (సైంధవ్)తో ఢీల్ కుదుర్చుకుంటాడు. సైకో ఎవరు? సైంధవ్ ఇంతకుముందు ఏం చేసేవాడు? తన కూతుర్ని కాపాడుకోగలిగాడా? ఇది ‘సైంధవ్’ మూవీ కథ.

గుంటూరు కారం రివ్యూ : ఓన్లీ ఫర్ ఫ్యాన్స్.. మిగిలిన వాళ్లకి ఎక్కడం కష్టమే..

మొదటి రెండు సినిమాలతో మిస్టరీ థ్రిల్లర్స్ తీసి సూపర్ సక్సెస్ అయిన శైలేష్, ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌ జోడించి, ఓ మాఫియా జోనర్ మూవీ ప్లాన్ చేశాడు. ఈ ప్రయత్నంలో శైలేష్ కొంత సక్సెస్ అయినా, పూర్తి స్థాయిలో మాత్రం బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయాడు.

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ, తొలిసారి తెలుగులోకి వచ్చినా తనని సరిగ్గా వాడుకోలేకపోయాడు. సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కొన్ని సీన్స్‌లో వీక్‌గా అనిపిస్తుంది. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ వంటి హీరోయిన్లను, ఆర్య వంటి నటుడిని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయారని అనిపిస్తుంది.

హనుమాన్ మూవీ రివ్యూ: No words, Only Goosebumps.. కంటెంట్ ఉన్న కటౌట్..

ఓవరాల్‌గా ‘సైంధవ్’ బాగుందని అనిపించకపోయినా, బాగానే ఉందనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఎడిటింగ్‌తో పాటు కొన్ని సీన్స్ విషయంలో కాస్త టైట్ స్క్రీన్ ప్లే చేసి ఉంటే, ‘సైంధవ్’ సరిగ్గా టార్గెట్‌ని కొట్టి ఉండేది.

మొత్తానికి వెంకీ 75వ చిత్రం కాస్త గురి తప్పినా, టార్గెట్‌ని మాత్రం టచ్ చేస్తూ వెళ్లి, Above యావరేజ్ మూవీగా మిగిలింది.

టాలీవుడ్ ఓ బిగ్ బాస్ హౌస్ అయితే వెంకటేష్ పక్కా సేఫ్ గేమ్ ప్లేయర్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post