Venkatesh Saindhav Movie : వెంకీ కూడా ‘సైంధవ్’ దించుతున్నాడు! సంక్రాంతికి కొట్లాట తప్పదేమో..

Venkatesh Saindhav movie : సంక్రాంతి 2024 పోటీ మామూలుగా లేదు. జనవరి 1 నుంచి 12 వరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. అయితే జనవరి 12 నుంచి 14 మధ్య ఐదు తెలుగు సినిమాలు, రెండు తమిళ్ సినిమాలు, ఓ హిందీ సినిమా రిలీజ్ అవుతున్నాయి. హాలీవుడ్ సినిమాల సంగతి వేరే..

హనుమాన్ ట్రైలర్: సంక్రాంతికి వస్తున్నామ్, కొడుతున్నామ్..

‘గుంటూరు కారం’ విడుదలైన రోజే ‘హనుమాన్’ రిలీజ్ అవుతుంటే, ఆ తర్వాతి రోజు రవితేజ ‘ఈగల్’, వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ‘సైంధవ్’ ట్రైలర్ విడుదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కూతురి సెంటిమెంట్‌తో పాటు సైకోగా సైంధవ్ ఫ్లాష్ బ్యాక్.. ఇలా ఈ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కూతురిని కాపాడుకోవాలంటే రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయించాలి. దాని కోసం సైంధవ్ ఏం చేశాడు? ఈ సైకో ఎవరు? ట్రైలర్‌లోనే కథ మొత్తం చెప్పేసినా, థియేటర్‌లో చూడాల్సింది చాలానే ఉందంటున్నాడు డైరెక్టర్ శైలేష్…

Hanuman Movie : దిల్ రాజు చెప్పినట్టే చేశాడుగా! హనుమాన్ మూవీకి మరింత ఇంత అన్యాయమా..

ఈ ట్రైలర్‌ కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి సైంధవ్ ఫస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. ‘గుంటూరు కారం’ మూవీ టాక్ కాస్త తేడా కొట్టినా, ‘సైంధవ్’ కలెక్షన్లు కొల్లగొట్టేయడం ఖాయం. విక్టరీ వెంకటేశ్ మూవీ కాబట్టి కాస్త యావరేజ్ టాక్ వచ్చినా, పండగకి సేఫ్ సైడ్ అయిపోవడం కూడా గ్యారెంటీ.. చూస్తుంటే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కోట్ల కోసం కొట్లాట భారీగానే ఉండేలా కనిపిస్తోంది.. ఈ పందెం కోళ్లల్లో ఏ కోడి విజేతగా నిలుస్తుందో మరో 10 రోజుల్లో తేలిపోతుంది..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post