Varun Tej :సినిమా, సినిమాకి వైవిధ్యం చూపించాలని కోరుకునే మెగా హీరో వరుణ్ తేజ్ (varun tej). ‘ముకుంద’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, ‘కంచె’, ‘లోఫర్’, ‘మిస్టర్’, ‘ఫిదా’ ఇలా దేనికదే సంబంధం లేని సినిమాలతో తెలుగువారిని పలకరించాడు.
వరుణ్ తేజ్ కెరీర్‌లో ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్ 2’, ‘గద్దలకొండ గణేశ్’ వంటి కమర్షియల్ సక్సెస్‌లు ఉన్నా, ‘ఫిదా’ తెచ్చిన గుర్తింపు వేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, తెలుగువారిని ‘ఫిదా’ చేసేసింది. హైబ్రీడ్ పిల్ల భానుమతి మ్యాజిక్‌కి వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘ఫిదా’…
లవ్ స్టోరీలతో సక్సెస్‌లు అందుకున్న వరుణ్ తేజ్, ప్రయోగాలు చేసినప్పుడు మాత్రం విజయాలు అందుకోలేకపోతున్నాడు. ‘గని’, ‘గాంఢీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఇలా వరుసగా మూడు డిజాస్టర్లు ఫేస్ చేశాడు వరుణ్ తేజ్. మధ్యలో వెంకీతో కలిసి చేసిన ‘F3’ మూవీ కూడా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే మూవీ చేస్తున్నాడు వరుణ్ తేజ్…
మాస్, ప్రయోగాలు కలిసి రాకపోవడంతో మళ్లీ లవ్ స్టోరీలనే నమ్ముకోవాలని అనుకుంటున్నాడట వరుణ్ తేజ్. ‘మట్కా’ మూవీ తర్వాత వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ‘ఫిదా’ మూవీకి సీక్వెల్‌గా వరుణ్ – శేఖర్ సినిమా ఉంటుందని కూడా టాక్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. దీంతో ‘ఫిదా’కి సీక్వెల్ తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
‘ఫిదా’ సక్సెస్‌కి సాయి పల్లవి ప్రధాన కారణం. దీంతో మరి వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల సినిమాలో సాయి పల్లవి నటిస్తుందో లేదో ఇంకా తెలీదు. ప్రస్తుతం ధనుష్‌తో ‘కుబేరా’ మూవీ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల సినిమా ఉంటుంది.