Varun Tej : ఆపరేషన్ కూడా పాయే! ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్..

Varun Tej : మెగా హీరోల్లో వరుసగా ప్రయోగాలు, భిన్నమైన పాత్రలు ఎంచుకునే హీరో వరుణ్ తేజ్. అయితే వరుణ్ తేజ్ ప్రయోగాలు చేసిన ప్రతీసారీ, జనాల నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదు. తాజాగా ఎయిర్‌ఫోర్స్ ఆర్మీ సోల్జర్‌గా వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మొదటి రోజు మొత్తంగా రూ.2 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టగలిగింది. దాదాపు రూ.42 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేవు..

Anant Ambani Wedding Cost : అనంత్ అంబానీ పెళ్లి కోసం అన్ని కోట్లా.. సెలబ్రిటీలంతా అక్కడే..

ఎగ్జామ్స్ సీజన్ కూడా కావడంతో కలెక్షన్లపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో వరుణ్ తేజ్, తన తర్వాతి సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడట. అప్పుడెప్పుడో ‘మట్కా’ అనే సినిమాని అనౌన్స్ చేశాడు వరుణ్ తేజ్. అయితే ఈ సినిమా యూనిట్ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే విషయంపై అనుమానాలు రేగుతున్నాయి..

దీంతో వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ‘ఫిదా’ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట వరుణ్ తేజ్. సాయి పల్లవి, వరుణ్ తేజ్ కలిసి ఓ లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం ‘ఫిదా’ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ధనుష్‌తో సినిమా చేసేందుకు రెఢీ అవుతున్నాడు. ధనుష్ ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో ‘రాయన్’ అనే సినిమా చేస్తున్నాడు..

Sai Dharam Tej : బడ్జెట్‌ పెరిగి ఆగిన సాయిధరమ్ తేజ్ సినిమా! ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్..

ఈ మూవీ అయ్యాక శేఖర్ కమ్ముల సినిమా మొదలవుతుంది. ఓ సినిమా అయ్యాక కనీసం రెండేళ్లకు కానీ మరో సినిమా మొదలెట్టడు శేఖర్ కమ్ముల. మరి వరుణ్ తేజ్ ‘ఫిదా 2’ సెట్స్ మీదకి వెళ్లాలంటే ఇంకో నాలుగేళ్లు ఆగాల్సిందే. అయితే వేరే డైరెక్టర్‌తో ‘ఫిదా’ సీక్వెల్ తీస్తే ఆలోచనలు కూడా ఉన్నట్టు సమాచారం..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post