Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ (Rudraprayag) నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ హైవేపై రాటోలి సమీపంలో టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో 12 మంది పర్యాటకులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో 12 మందికి గాయాలు కాగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వాహనంలో ఉన్న 26 మందిలో మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురు పర్యాటకులను విమానంలో తరలించి రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్చారు.
Kuwait Fire Incident : కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మృతుల్లో భారతీయులు..
శనివారం ఉదయం సుమారు 11:45 గంటలకు రుద్రప్రయాగ్‌లో జరిగిన విషాద సంఘటన తర్వాత రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) తక్షణమే రెస్క్యూ మరియు రిలీఫ్ కార్యకలాపాలను ప్రారంభించింది. SDRF కమాండెంట్ మణికాంత్ మిశ్రా దీనిపై స్పందిస్తూ.., “రెండు SDRF బృందాలు కొనసాగుతున్న రెస్క్యూ మరియు రిలీఫ్ ప్రయత్నాల్లో చురుకుగా పాల్గొంటున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు మరియు 12 మంది బాధితుల అవశేషాలు వెలికి తీయబడ్డాయని” తెలిపారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం.. టెంపో ట్రావెలర్‌లో 26 మంది పర్యాటకులు ఉన్నారు. వీరు ఢిల్లీ మరియు హర్యానా నుండి ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చోప్తాను సందర్శించడానికి బయలుదేరారు. అక్కడ రైల్వే లైన్‌లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు వారిని రక్షించేందుకు దూకి వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని సమాచారం.
Kolkata Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం..
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. స్థానిక అధికారులు, SDRF బృందాల సహకారంతో, సహాయక మరియు రెస్క్యూ కార్యకలాపాలలో చురుకుగా నిమగ్నమై ఉన్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం సమీపంలోని వైద్య సదుపాయాలకు తరలించారు. రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు బాధ్యతలు అప్పగించారు.