Upendra Hollywood Movie : రాజమౌళి కంటే ముందు పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు మణిరత్నం, శంకర్. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ వంటి సూపర్ హిట్స్ కొట్టిన శంకర్, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు.
ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..
రజినీ హీరోగా వచ్చిన ‘రోబో’, దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓ మర మనిషి, మనిషిలాగే నడవడం, మాట్లాడడం, ఆలోచించడం వంటి కాన్సెప్ట్, సినీ జనాలకు కొత్తగా అనిపించింది. అయితే ఇదే కాన్సెప్ట్‌తో 2002లోనే ఉపేంద్ర, ‘హాలీవుడ్’ అనే పేరుతో ఓ సినిమా తీశాడు. ‘హాలీవుడ్’ మూవీలో హీరో ఉపేంద్ర, తనలా ఉండే ఓ రొబోని సృష్టిస్తాడు.
ఈ రోబో ప్రవర్తించే సీన్లు, కామెడీ సన్నివేశాలు అన్నీ కూడా శంకర్ ‘రోబో’లో అచ్చు దించేశాడు. నిజానికి ‘రోబో’ కంటే ‘హాలీవుడ్’ మూవీలో కామెడీ చాలా సహజంగా ఉంటుంది. అంతేకాదు ‘హాలీవుడ్’ మూవీలోనూ హీరో తయారు చేసిన రోబో, సొంతంగా ఆలోచించడం మొదలెడుతుంది. హీరోయిన్‌ని ప్రేమించి, హీరోనే చంపాలని ప్రయత్నిస్తుంది. కథ, కథనం, సన్నివేశాలు అన్నీ కూడా ఉపేంద్ర సినిమా నుంచి లేపేశాడు శంకర్.
ఎన్టీఆర్- కృష్ణ మధ్య ఏం జరిగింది.. రామారావు సక్సెస్ చూసి తట్టుకోలేకనే..
‘హాలీవుడ్’ సినిమాకి కథ, కథనం, స్క్రీన్ ప్లే అన్నీ ఉపేంద్రే. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ అయితే అయ్యింది కానీ, ఓ రోబో సొంతంగా ఆలోచించడం, ప్రేమించడం వంటివి చూసి… అప్పుడు జనాలు నవ్వారు. కానీ అదే కథ, రజినీతో రూ.150 కోట్ల బడ్జెట్‌తో తీసేసరికి ‘ఔరా..’ అని నోరెళ్లబెట్టారు. ఓ రకంగా శంకర్‌కి వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చి పెట్టిన ‘రోబో’, ఉపేంద్ర ‘హాలీవుడ్’ సినిమాకి ఫ్రీమేక్..