Union Budget : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) జూలై 22న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి, వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్లను సమర్పించిన మొదటి ఆర్థిక మంత్రిగా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు.
US Student VISA : యూఎస్ స్టూడెంట్ వీసాకు పెరిగిన డిమాండ్..
తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, 18వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 24న ప్రారంభమవుతుంది. సెషన్ జూలై 3న ముగుస్తుంది. ఈ సెషన్లో, దిగువ సభలోని కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే స్పీకర్ ఎన్నుకోబడతారని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న లోక్‌సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు అలాగే రాబోయే ఐదేళ్ల కోసం కొత్త ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను వివరించే అవకాశం ఉంది.
తొలి సెషన్లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన నేతలు ప్రమాణ స్వీకారం చేసి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాజ్యసభ 264వ సెషన్ జూన్ 27న ప్రారంభమై జూలై 3న ముగుస్తుందని రిజిజు తెలిపారు.
NEET UG result 2024 : తిరిగి పరీక్షకు హాజరుకావచ్చు..
జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని భావిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానం ఇస్తారు.