Ugadi Pachadi : ఉగాది పచ్చడి..

Ugadi Pachadi : ఉగాది రోజున షడ్రుచులతో తయారు చేసే శ్రేష్టమైన పదార్థమే ఉగాది పచ్చడి. ఆత్మీయపరంగా ఈ పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆహారం ఆరోగ్యపరంగాను అంతే ఉన్నత ఫలితాలు ఉన్నాయి. ఈ పచ్చడి తినడం వల్ల దివ్యవంతమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు.

తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే ఆరు రకాల రుచులను కలిపి ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. కొత్త సహస్రాభివృద్ధికి ప్రారంభముగా సూచిస్తారు. ఈరోజు నుంచి కొత్త సంవత్సరం మొత్తం ఎదురయ్యే మంచి చెడులు, కష్టసుఖాలు ఆనంద విషాదాలు సంయమనంతో సానుకూలంగా స్పందించాలని ఉగాది పచ్చడిలోని ముఖ్య అంతర్యం.

Ugadi Festival 2024 : ఉగాది విశిష్టత..

పచ్చడికి కావలసిన పదార్థాలు :

* బెల్లం – తీపి మరియు ఆనందానికి సంకేతం
* ఉప్పు – జీవితంలో, ఉత్సాహము రుచికి సంకేతం
* వేప పువ్వు – బాధలు కలిగించే చేదు అనుభవాలు
* చింతపండు – పులుపు, నేర్పు కలిగి పరిస్థితులు వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు సానుకూలంగా మారడం
* పచ్చి మామిడికాయ ముక్కలు – వగరు, కొత్త సవాళ్లు ఎదుర్కోవడం
* మిర్చి – కారం, సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
* నీళ్లు – సరిపడ

తయారీ విధానం :
ముందుగా బెల్లం, మిర్చి మామిడికాయ ముక్కలను చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వేపపువ్వుని శుభ్రంగా కడిగి రేఖలు తీసి పువ్వులు మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు తగిన నీళ్ళల్లో చింతపండును బాగా కలిపి వడగట్టి పులుపును ఒక చిన్న గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత వేపపువ్వు, బెల్లం, మిర్చి, మామిడికాయ ముక్కలను వేయాలి. చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపితే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తయారు అవుతుంది.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post