Ugadi Festival 2024 : చైత్రం మాసంలో మొట్టమొదటి తిది ఉగాది. ఈ రోజున తెల్లవారకముందే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని గడపలకు పసుపు, కుంకుమ, మామిడి తోరణములు కట్టుకొని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని అలంకరించుకోవాలి. తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దేవాలయాలను దర్శించడం మంచిది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుంది.
ఉగాది రోజున తప్పనిసరిగా ఆలయంలో పంచాంగ శ్రవణం వినాలి. దీనిద్వారా మంచి, చెడులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఆలయాల్లో వసంత రాత్రికి ఉత్సవాలు జరపడం ద్వారా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున 108 సార్లు శ్రీరామ నామాన్ని జపిస్తే సత్ఫలితాలు చేకూరుతాయి.
Vishwa Hindu Parishath : సీతతో అక్బర్ని ఎలా జోడి కడతారు! కోర్టుకెక్కిన విశ్వ హిందూ పరిషత్..
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు, మత్సావతారం ధరించిన విష్ణుమూర్తి, సోమకునీ సంహరించి వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది జరుపుకుంటారు అన్ని పురాణాల ప్రతీతి..
బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాసంలో శుక్లపక్షం ప్రధమదినాన, సూర్యోదయం వేళ సమగ్రమంగ సృష్టించారు అంటారు, అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర ,రుతు, మాస ,వర్ణ, వర్షాధికులను, బ్రహ్మదేవుడు ఈరోజు ప్రవర్తింప చేశారని పెద్దల భావన. అదే కాకుండా వసంత రుతువు కూడా ఇప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితాలకు నాందిగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు.
“ఉగాది” మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అనగా నక్షత్ర గమనం నక్షత్రాగమానికి “ఆది” “ఉగాది”అంటే సృష్టి ఆరంభమైన దినమే “ఉగాది” “యుగము”అనగా ద్వయము లేక జంట అని కూడా అర్థము. ఉత్తరాయము మరియు దక్షిణాయము అయినా ద్వయ సంయుక్తం “యుగం”(సంవత్సరం) కాగా ఆ యుగానికి “ఆది” (సంవత్సరాది) యుగాది అయినది ఉగాది శతాబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా రూపాంతరం చెందింది.