TTD Clarity : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి తిరుమల శ్రీవారి విషయంలో వ్యవహరించిన విధానం కూడా ఓ కారణం. వైసీపీ హయాంలో టీటీడీలో రాజకీయాలు పెరిగి, భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాలి వచ్చింది. గత ప్రభుత్వాలు ఎంతో బాధ్యతగా సక్రమంగా నిర్వహిస్తూ వచ్చిన విషయాలను కూడా పక్కదారి పట్టించి, అన్యమత ప్రచారానికి కూడా తిరుమలను వాడుకుంది వైసీపీ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం ప్రభుత్వ ఖజానాకి సొమ్ములు తెచ్చే ఆదాయ మార్గంగానే చూసింది..
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన మొదలెట్టిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ‘గత ప్రభుత్వ హాయంలో అడ్డగోలుగా పెంచేసిన ధరలను టీడీపీ సర్కారు తగ్గించింది. తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్లను రూ.300లకు పెంచగా దాన్ని ప్రస్తుతం రూ.200లకు తగ్గించారు. అలాగే రూ.50 ఉన్న లడ్డూ ధరను రూ.25కి తగ్గించారు..’ అనేది ఆ వైరల్ వార్త సారాంశం..
Accommodation in Tirumala : తిరుమలలో రూమ్ దొరకడం లేదా! ఇలా చేస్తే నిమిషాల్లో రూమ్ గ్యారంటీ!!
అయితే ఛార్జీలు తగ్గించినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని ట్విట్టర్ ద్వారా కన్ఫార్మ్ చేసింది. భక్తులు ఈ ఫేక్ వార్తలను నమ్మకూడదంటూ మనవి చేసింది.. టికెట్ రేట్ల విషయంలో జోక్యం చేసుకోకపోయినా వీఐపీ దర్శనం విషయంలో మాత్రం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు శ్రీవారి భక్తులు..