TSRTC free bus Effect : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొదటి హామీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ ఫ్రీ బస్సు కారణంగా ఎంత మందికి ఉపయోగం కలుగుతుందో తెలీదు కానీ చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఫ్రీగా వెళ్లొచ్చు కదా! అని ఓ 12 ఏళ్ల బాలిక, బస్సు ఎక్కి 3 రోజులుగా తిరుగుతూనే ఉంది.
మీ భాషాభిమానం తగలెయ్యా! బెంగళూరులో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సీన్స్..
కరీంనగర్‌కి చెందిన 12 ఏళ్ల వశిష్ట కృష్ణ, సెలవులకు పెద్దపల్లిలో ఉండే తాతయ్య ఇంటికి వచ్చింది. సెలవులు అయ్యాక స్కూల్‌కి వెళ్లడం ఇష్టం లేక తాతయ్య దగ్గరే ఉంటానని చెప్పింది. అయితే అందుకు స్కూల్‌కి వెళ్లాల్సిందేనని చెప్పడంతో బడికి వెళ్లడం ఇష్టం లేక ఫ్రీ బస్సు ఎక్కి హైదరాబాద్‌కి వచ్చేసింది.
హైదరాబాద్‌లో బస్సులు మారుతూ మూడు రోజులుగా అన్ని ఏరియాలు తిరుగుతూ వచ్చింది. తాతయ్య ఇంటి నుంచి బయలుదేరిన బాలిక, ఇంటికి రాకపోవడంతో వశిష్ట తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫేటేజీ ఆధారంగా బాలిక హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్‌లో ఉందని తెలుసుకున్నారు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంటికి పంపించారు.
స్కూలుకు పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సులో తిరిగిన కరీంనగర్ బాలిక
మిస్సింగ్ కేసు ఫిర్యాదుతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. pic.twitter.com/HGGvOUoMP4
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2023