TS Polling : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదు కాగా, ఉదయం 11 గంటల వరకూ కేవలం 25 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండగా హైదరాబాద్ వంటి నగరాల్లో పోలింగ్ శాతం ఇంకా సింగిల్ డిజిట్ కూడా దాటలేదు..
వాచీలు, క్రికెట్ కిట్స్, చీరలు.. ప్రచారం ఆగింది, పంపకాలు మొదలయ్యాయి!
ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యూత్ సంఖ్య పెరిగింది. అయితే ఓటింగ్ శాతంలో మాత్రం ఆ రిజల్ట్ కనిపించడం లేదు.
పోలింగ్‌కి ముందు ఓటర్లకు డబ్బులు పంచడం సర్వ సాధారణం. అయితే ఈసారి పోలీస్ రైడింగ్స్‌లో వందల కోట్లు సొత్తు దొరికింది. దీంతో చాలా ఏరియాల్లో అభ్యర్థులు, ఓటర్లకు డబ్బులు పంచాలని చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఆ ప్రాంతాల్లో జనాలు, అభ్యర్థులను డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ చోటా మోటా నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతుండడం విశేషం.. డబ్బులు పంచకపోతే ఓటు వేయబోమని కూడా హెచ్చరిస్తున్నారు.
నోటాకు ఓటేస్తే.. ప్రయోజనం ఏంటి..!?
ఒకప్పుడు ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, డబ్బులు పంచిపెట్టేవాళ్లు. ఇప్పుడు డబ్బులు ఇవ్వడం లేదని స్వయంగా ఓటర్లే, అభ్యర్థులను డిమాండ్ చేస్తుండడం అదిరిపోయే డెవలప్‌మెంట్. ఇది ఇలాగే కొనసాగితే మున్నుందు ఇలాంటి చిత్రాలు చూడాల్సి వస్తుందో మరి..