True Lover Review : రియాలిటీని చూపించిన 5G లవ్ స్టోరీ..

True Lover Review : 20 ఏళ్ల క్రితం ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటేనే మనసులో ఓ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పుడు ట్రెండే మారిపోయింది. ఇన్‌స్టాలో పరిచయాలు, ఫేస్‌బుక్‌లో ప్రేమలు, వాట్సాప్‌లో రొమాన్స్ చేసుకుంటున్నారు ప్రేమికులు. దీన్ని బేస్ చేసుకుని వచ్చిన లవ్ స్టోరీయే ‘True lover’…

ఐటీ ఎంప్లాయ్ దివ్య, తన కోలీగ్స్‌కి తన ప్రేమకథను చెప్పడంతో సినిమా మొదలవుతుంది. దివ్య చెప్పిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ విని, ఆమె కొలీగ్స్ మైమరిచిపోతారు. అయితే అప్పుడే అరుణ్ ఫోన్ చేయడంతో అతని మాటలు విని షాక్ అవుతారు.. ఓ Insecure బాయ్‌ఫ్రెండ్‌, ఓ ఇంటిపెండెంట్ స్టాఫ్‌వేర్ ఎంప్లాయ్ మధ్య ప్రేమ కథే ఈ True Lover మూవీ అని ఫస్ట్ సీన్‌లోనే చెప్పేస్తాడు డైరెక్టర్..

శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, భరత్ విక్రమన్ ఎడిటింగ్, సీన్ రోల్డన్ మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ముఖ్యంగా ప్రభురామ్ వ్యాస్ డైరెక్షన్‌కి సీన్ రోల్డన్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది.

‘Good Night’ మూవీలో గురక అనే చిన్న విషయాన్ని చాలా చక్కగా చూపించిన మణికందన్, True lover మూవీలోనూ తన స్టైల్ యాక్టింగ్‌తో ఇరగదీసేశాడు. ‘MAD’, మెయిల్, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమాల్లో నటించిన శ్రీ గౌరీ ప్రియ, తన క్యారెక్టర్‌లో జీవించేసింది. ఈ మూవీ తర్వాత తెలుగులో శ్రీ గౌరీకి అవకాశాలు కచ్ఛితంగా పెరుగుతాయి.

టీనేజ్ వయసు దాటిన ప్రతీ ఒక్కరూ ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. వాలెంటైన్స్ డే వీక్‌కి ప్రేమికులకు సరైన సినిమా.. సింగిల్ చింతకాయలు కూడా ఈ సినిమా చూసి, ఇలాంటి లవర్ లేకపోవడమే బెటర్ అని కొన్నిచోట్ల హ్యాపీగా ఫీల్ అవ్వొచ్చు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post