Trolls on Guntur Kaaram : మహేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూర్ కారం’ మూవీ, బెనిఫిట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే మహేష్ బాబుకి ఉండే ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ కారణంగా ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టగలుగుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటించింది.
గుంటూరు కారం రివ్యూ : ఓన్లీ ఫర్ ఫ్యాన్స్.. మిగిలిన వాళ్లకి ఎక్కడం కష్టమే..
రమ్యకృష్ణతో పోటీపడి సినిమాలు చేసిన సిమ్రాన్, సాక్షి శివానంద్, బిపాసా బసులతో సినిమాలు చేశాడు మహేష్. అయితే తన తండ్రి కృష్ణతో సినిమాలు చేయడం వల్లనేమో, మహేష్ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్గా చేయలేదు. అయితే ‘నాని’ సినిమాలో ఈ ఇద్దరూ ఓ రొమాంటిక్ సాంగ్‌లో ఆడిపాడారు. ఇప్పుడు ‘గుంటూర్ కారం’ మూవీని టార్గెట్ చేసి, ట్రోల్ చేస్తున్న కొందరు అభిమానులు.. ‘నాని’ సినిమాలో రొమాంటిక్ స్టిల్స్‌ని వైరల్ చేస్తున్నారు.
‘బడి పంతులు’ సినిమాలో ఎన్టీఆర్‌కి మనవరాలిగా నటించిన శ్రీదేవి, ఆ తర్వాత చాలా సినిమాల్లో ఎన్టీఆర్‌కి జోడిగా నటించింది. ఎన్టీఆర్ తర్వాతి తరం చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ సినిమాల్లో హీరోయిన్గా నటించిది. నటన వేరు, జీవితం వేరు. కాబట్టి ఇలా ఓ సినిమాలో రొమాంటిక్ సాంగ్ చేశారని, ఇప్పుడు ఇలా చేయకూడదన్నట్టుగా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.
సినిమాల కోసం MBBS Examsకి డుమ్మా కొట్టిన శ్రీలీల.. సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలంటూ..