Trivikram – Allu Arjun : ‘గుంటూర్ కారం’ తర్వాత మరో మూవీని అనౌన్స్ చేయలేదు తివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా, మంత్రిగా సెటిల్ కావడంతో ఆయన ఆప్తమిత్రుడు తివిక్రమ్ శ్రీనివాస్, సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాలకు అంకితం అవ్వాలని డిసైడ్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తివిక్రమ్‌కి, అల్లు అర్జున్‌కి ఎప్పుడు కెరీర్‌లో గ్యాప్ వచ్చినా ఈ ఇద్దరూ కలిసి సినిమాలు తీసేస్తూ ఉంటారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాలని అనుకుంటే ముందుగా అనుకునేది ముగ్గురునే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్. ఈ ముగ్గురితో మూడేసి సినిమాలు చేసిన తివిక్రమ్ శ్రీనివాస్, బన్నీకి మాత్రమే హ్యాట్రిక్ ఇచ్చాడు. అల్లు అర్జున్- తివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో నాలుగో సినిమా రాబోతుందని సమాచారం. ‘పుష్ప 2’ రిలీజ్ చేశాక అట్లీ సినిమా చేయాలని అనుకున్నాడు బన్నీ. అయితే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో నేరుగా గురూజీతో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడని టాక్..
Allu Arjun : బన్నీకి దెబ్బ మీద దెబ్బ! ఆ సినిమా కూడా ఆగిపోయిందా..!?
అయితే అల్లు అర్జున్ – తివిక్రమ్ శ్రీనివాస్ సినిమా బడ్జెట్ రూ.1200 కోట్లు అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజంగా తివిక్రమ్ శ్రీనివాస్ ఇంత బడ్జెట్‌ని హ్యాండిల్ చేయగలడా? ‘నువ్వే నువ్వే’ మూవీ నుంచి తివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను సునిశితంగా పరీక్షిస్తే.. డైలాగులు తప్ప, చిన్న పాయింట్ తీసుకుని రాసుకున్న కథలు తప్ప గొప్ప కథ, కథనాలేమీ ఉండవు.
‘జులాయి’ సినిమాలో చాలా సీన్స్ హాలీవుడ్ సినిమాల నుంచి లేపేస్తే, ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాల్లో రిచ్‌నెస్ కనిపించినా కామెడీ వల్లే అది వర్కవుట్ అయ్యింది. తివిక్రమ్ శ్రీనివాస్ భారీ బడ్జెట్ పెట్టి, మూడేళ్లు తీసిన ‘ఖలేజా’, కథ మారి, మారి రెండేళ్లకు పైగా లాగిన ‘గుంటూర్ కారం’ రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. కాబట్టి తివిక్రమ్ శ్రీనివాస్ మరీ ఓ రూ.200-300 కోట్ల వరకూ అంటే మ్యానేజ్ చేయగలడేమో కానీ, అంతకంటే ఎక్కువైతే గురూజీ వల్ల కాని పని అంటున్నారు ఆయన ఏకలవ్య శిష్యులు..