Tollywood Secrets : ఒక హీరోతో అనుకున్న సినిమా, మరో హీరోకి వెళ్లడం చాలా కామన్. అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా మొదలైన ఓ సినిమా, రవితేజ హీరోగా థియేటర్లలోకి వచ్చిందనే విషయం మీకు తెలుసా.. అవును! 2009లో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్‌పై ‘భీష్మ’ అనే సినిమా పోస్టర్‌ని రిలీజ్ చేశారు. అప్పటికే ‘ఒక ఊరిలో’, ‘రైడ్’ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ రమేశ్ వర్మ, బాలయ్యతో ‘భీష్మ’ సినిమా చేస్తాడని ప్రకటించారు. మరో 20 రోజుల్లో బాలయ్య సెట్స్ మీదకి వెళ్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు..
ఆఖరికి ఇదే కథను టైటిల్ మార్చి, ‘వీర’ పేరుతో రవితేజ హీరోగా తెరకెక్కించాడు రమేశ్ వర్మ. తాప్సీ, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ‘వీర’ సినిమాకి నిర్మాత గణేశ్ ఇదుకూరి. బాలయ్య డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా తప్పుకున్నాడు. 2011, మే 20న రిలీజ్ అయిన ‘వీర’ సినిమా, రవితేజ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. రొటీమ్ మాస్ యాక్షన్ స్టోరీని అటు తిప్పి, ఇటు తిప్పి రాశారు పరుచూరి బ్రదర్స్. దాన్ని డీల్ చేయడంలో రమేశ్ వర్మ కూడా ఫెయిల్ అయ్యాడు.
Ilaiyaraaja : పక్కా కమర్షియల్.. మ్యూజిక్ మాస్ట్రో చేస్తుంది కరెక్టేనా..
నందమూరి బాలకృష్ణ ఈ సినిమా చేసినా రిజల్ట్ ఏమీ మారకపోయేది. ఇంకా దారుణంగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యేది. ‘భీష్మ’ మూవీని రిజెక్ట్ చేసిన బాలయ్య, ఇదే సమయంలో బోయపాటి శ్రీనుతో ‘సింహా’ మూవీ చేశాడు. 2010లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ‘సింహా’. ‘లక్ష్మీ నరసింహా’ తర్వాత వరుసగా ఏడు ఫ్లాపుల ఫేస్ చేసిన తర్వాత నందమూరి బాలకృష్ణకి దక్కిన కమర్షియల్ సక్సెస్ ఇదే.. అయితే ఆ తర్వాత ‘పరమ వీర చక్ర’ మూవీ చేసి, డిజాస్టర్‌ని ఫేస్ చేశాడు బాలయ్య. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన 150వ సినిమా ‘పరమ వీర చక్ర’, విమర్శకుల నుంచి ‘పరమ బోరు చక్ర’గా ట్రోల్స్ ఫేస్ చేసింది.