Tollywood Heros Tags : తెలుగు హీరోలకు స్టార్ ట్యాగ్ ఓ పిచ్చి. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ నుంచి హీరోల పేర్ల ముందు స్టార్ తగిలించుకునే ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఆ తర్వాతి సినిమాకే ‘మెగా పవర్ స్టార్’ ట్యాగ్ తగిలించుకున్నాడు. RRR తర్వాత ఏకంగా ‘గ్లోబల్ స్టార్’గా మారాడు. మేనల్లుడు సాయిధరమ్ తేజ, మామ ‘సుప్రీమ్’ హీరో ట్యాగ్‌ని వాడుకోగా వరుణ్ తేజ్ ‘మెగా ప్రిన్స్’గా పిలవబడుతున్నాడు.
ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ “రెబల్ స్టార్” స్టార్ గా కంటిన్యూ అవుతుండగా, మహేష్ బాబుకి ప్రిన్స్, సూపర్ స్టార్ ట్యాగ్స్ వాడుతున్నారు. సుప్రీం హీరో, నటకిషోర్ వంటి ట్యాగ్స్ ఉండేవి చిరంజీవికి మొదట్లో గ్యాంగ్ లీడర్ నుంచి మెగాస్టార్ సెటిల్ అయ్యింది. కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్‌కి ‘యంగ్ టైగర్’ అనే ట్యాగ్ ఉండేది. ‘శక్తి’ సినిమా కోసం ‘A1 స్టార్’ అని వాడగా అది వర్కవుట్ కాలేదు. కొత్తగా ‘Man of Masses’ అంటూ ట్యాగ్, ఎన్టీఆర్‌కి వాడుతున్నారు.
Tollywood : తెలుగు సినిమాకు ‘టాలీవుడ్’ అనే పేరు ఎలా వచ్చింది..!?
‘స్టైలిష్ స్టార్’గా చాలా రోజులు చెలామణీలో ఉన్న అల్లు అర్జున్, అది బోర్ కొట్టడంతో ‘పుష్ప’ నుంచి ‘ఐకాన్ స్టార్’గా మారాడు. ‘యువరత్న’ ట్యాగ్ వేసుకున్న నందమూరి బాలకృష్ణ, ‘ఒక్కమగాడు’ సినిమాలో తండ్రి బిరుదులో సగం వాడుకుంటూ ‘విశ్వవిఖ్యాత నటరత్న’గా మారాడు. ఇప్పుడు NBK అంటే Natural Born King అంటూ కొత్త ట్యాగ్ వాడుతున్నాడు..
విశ్వక్ సేన్ ‘మాస్ కా దాస్’ అనే ట్యాగ్ వాడుతుంటే, నితిన్ ‘లవర్ బాయ్’, ‘విక్టరీ’ వంటివి వాడగా రామ్ పోతినేని ‘ఎనర్జిటిక్ హీరో’ అని వేసుకుంటున్నాడు. వారసుల కొడుకులతో పాటు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు రవితేజ ‘మాస్ మహారాజ్’, నాని ‘నేచురల్ స్టార్’, విజయ్ దేవరకొండ ‘రౌడీ స్టార్’ వంటి ట్యాగులు వాడుతున్నారు. తాజాగా శర్వానంద్ కూడా ‘ఛార్మింగ్ స్టార్’ అనే ట్యాగ్‌తో ‘మనమే’ సినిమాతో రాబోతున్నాడు.