Tollywood Box-office : తెలుగులో ఈ ఏడాదికి మంచి స్టార్టే దొరికింది. ‘హనుమాన్’ రికార్డు బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ అయితే, అదే సీజన్లో వచ్చిన ‘నా సామి రంగ’ నిర్మాతలకు లాభాలు తెచ్చింది. నెగిటివ్ టాక్ని తట్టుకుంటూ ‘గుంటూర్ కారం’ యావరేజ్‌గా ఆడింది. అయితే ఆ తర్వాత హిట్లు తగ్గిపోయాయి. ఇప్పటిదాకా 5 నెలల్లో సూపర్ కమర్షియల్ సక్సెస్ అందుకున్న సినిమాలు 8. మార్చి నెలాఖరున వచ్చిన ‘టిల్లు స్క్వైర్’ తర్వాత 7 వారాలుగా ఒక్క సినిమా కూడా హిట్టు స్టేటస్ దక్కించుకోలేదు.
Tollywood Actors : జనసేనానికి టాలీవుడ్ సపోర్ట్.. నాని, రాజ్ తరుణ్, మెగాస్టార్‌తో పాటు..
ఏప్రిల్ మొదటి వారంలో ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత ఆ నెల మొత్తం పెద్దగా సినిమాల రిలీజ్లు లేక డ్రై సీజన్‌గా నడిచింది. మే మొదటి వారంలో సినిమాలు రిలీజ్ అయినా వాటికి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. రెండు వారాల కిందట ‘ప్రసన్నవదనం’, ‘బాక్’, ‘ఆ ఒక్కటి అడక్కు’ వంటి నాలుగు సినిమాలు వచ్చాయి. వీటిల్లో తెలుగులో ‘ప్రసన్నవదనం’ సినిమాకి కాస్త కూస్తో రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’ డిజాస్టర్ లిస్టులో చేరిపోగా తమన్నా భాటియా ‘బాక్’ మూవీకి తెలుగులో మంచి రెస్పాన్సే వచ్చింది.
తమిళ్లో ‘అరన్మనై’ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ 3 రోజుల్లో రూ.28 కోట్లు రాబట్టింది. వీక్ డేస్‌లో కూడా స్టడీ కలెక్షన్లు రాబడుతూ, అక్కడ బాగానే ఆడుతోంది. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. కామెడీ వర్కవుట్ కాకపోయినా హార్రర్ సీన్స్ బాగా పేలడంతో థియేటర్లు కిటకిటలాడాయి.
ఈ వారం సత్యదేవ్ ‘కృష్ణమ్మ’, నారా రోహిత్ ‘ప్రతినిథి 2’, ‘ఆరంభం’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటికి కూడా జనాల నుంచి రెస్పాన్స్ రాలేదు. మొదటి రెండు రోజుల్లో ఈ సినిమాలకు వచ్చిన షేర్ 15 శాతం కూడా దాటలేదు. దీంతో ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా తేలిపోయినట్టే. ఐపీఎల్ ఎఫెక్ట్‌తో పాటు సమ్మర్, ఎలక్షన్స్ ప్రభావం సినిమాలపై తీవ్రంగా పడుతోంది. చూస్తుంటే ప్రభాస్ ‘కల్కి’ వచ్చేదాకా థియేటర్ల దగ్గర ఇవే దృశ్యాలు కొనసాగుతాయామో..