Tollywood Actors : జనసేనానికి టాలీవుడ్ సపోర్ట్.. నాని, రాజ్ తరుణ్, మెగాస్టార్‌తో పాటు..

Tollywood Actors : ఏపీ ఎలక్షన్స్‌ దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తెగ బిజీగా ఉన్నాడు. ఏపీ ఎలక్షన్స్‌లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ గెలుపోటములపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి బంపర్ మెజారిటీ దక్కుతుందని కొందరు అంటుంటే, ఈసారి కూడా ఓటమి తప్పదని మరికొందరు అంటున్నారు. తాజాగా జనసేనానికి టాలీవుడ్ నుంచి సపోర్ట్ వచ్చింది..

‘పవన్ కళ్యాణ్ గారు, రాజకీయాల్లో పెద్ద యుద్ధమే ఎదుర్కోబోతున్నారు. మా ఫిల్మ్ ఫ్యామిలీ సభ్యుడైన ఆయన విజయం అందుకుని, తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నా. నా సపోర్ట్ మీకే.. ఆల్ ది బెస్ట్ సర్’ అంటూ ట్వీట్ చేశాడు హీరో నాని.

Pawan Kalyan : నా నాలుగో పెళ్లానివి నువ్వే..!

అలాగే కుర్ర హీరో రాజ్ తరుణ్ కూడా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ ప్రకటించాడు. ‘మొదటి రోజు నుంచి నేను మీ విజెన్‌ని చూస్తున్నా. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించేందుకు మీరు పడుతున్న కష్టం చూస్తున్నా.. కొన్ని కోట్ల మంది ఆశావహుల్లో ఒక్కడినైన నేను, మీరు ఎన్నికల్లో గెలిచి, జనాల జీవితాల్లో మార్పు తేవాలని కోరుకుంటున్నా సార్.. ఇప్పుడు జనానికి నువ్వు కావాలి’ అంటూ ట్వీట్ చేశాడు రాజ్ తరుణ్..

అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ‘జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి’ అంటూ వీడియో ద్వారా అభిమానులను కోరాడు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post