Tillu Square Review : ‘డీజే టిల్లు’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రెండేళ్లు గ్యాప్ తీసుకుని, ‘టిల్లు స్క్వైర్’ సినిమాని తీసుకొచ్చాడు సిద్ధూ జొన్నలగడ్డ. అప్పుడెప్పుడో 2022 ఆగస్టులో మొదలైన ‘టిల్లు స్క్వైర్’ సినిమా, అనేక వాయిదాలు పడుతూ మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. మరి టిల్లు గాడి గోల, ఈసారి కూడా జనాలకు నచ్చినట్టేనా!
‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ అయినా, ‘టిల్లు స్క్వైర్’ సినిమా కోసం ఫ్రెష్ కథను రాసుకున్నాడు సిద్ధూ. మొదటి సినిమాలో రాధికా చేసిన హత్య, శవం మాయం చేయడం వంటి పరిణామాల చుట్టూ సినిమా తిరుగుతుంది. ‘టిల్లు స్క్వైర్’ ఏకంగా అంతకుముందు డ్రగ్స్, గన్స్ ఢీలింగ్ వంటి క్రైమ్స్‌తో ముడిపడిన కథ. మొదటి పార్ట్‌కి టిల్లు క్యారెక్టర్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీయే ప్రధాన బలం. రెండో పార్ట్‌కి కూడా అంతే. అయితే ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండో ట్రైలర్, రిలీజ్ ట్రైలర్.. ఇలా చాలా సీన్స్‌ని ఇప్పటికే విడుదల చేసింది చిత్ర యూనిట్. దీంతో సినిమాలో చాలా సీన్స్ బాగున్నా, బోర్ కొట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది..
Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో 60 సినిమాలు..
‘డీజే టిల్లు’ సినిమాకి నేహా శెట్టి గ్లామర్ ప్లస్ అయినట్టే, ‘టిల్లు స్క్వైర్’లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఇన్నాళ్లు హోమ్లీ బ్యూటీగా కనిపించిన అనుపమ, ఇందులో గ్లామర్ షోతో రెచ్చిపోయింది. అనుపమ గ్లామర్ యూత్‌ని అట్రాక్ చేయొచ్చు. కిస్సింగ్ సీన్స్, కథానుగుణంగా వచ్చే కొన్ని అడల్ట్ సీన్స్.. కుటుంబంతో సినిమా చూసేవాళ్లకి కాస్త ఇబ్బంది పెట్టొచ్చు.
టిల్లు మూవీలో మరో ప్లస్ పాయింట్ టిల్లు తండ్రి మురళీధరన్ గౌడ్ పాత్ర. ప్రిన్స్, మురళీ శర్మ, తదితరులు తమ పాత్రల్లో నటించి, మెప్పించారు. రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకల అందించిన పాటలు ఇప్పటికే హిట్టు అయ్యాయి. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నా, ‘డీజే టిల్లు’నే గుర్తుకు తెస్తుంది. మొత్తానికి ‘డీజే టిల్లు’ మూవీలో టిల్లు గాడి అల్లరిని బాగా ఎంజాయ్ చేసిన వారికి, ‘టిల్లు స్క్వైర్’ నచ్చుతుంది. అయితే కొన్ని సీన్స్ బోరింగ్‌గా, కొత్తదనం కొరవరినట్టు అనిపించొచ్చు…