Tier 2 Heros : టాలీవుడ్‌లో టైర్ 1 హీరోల కంటే టైర్ 2 హీరోల మధ్యే విపరీతమైన పోటీ ఉంటుంది. కొన్నాళ్లుగా నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో టైర్ 2లో నెం.1గా నిలిచాడు. విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, నితిన్, శర్వానంద్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, నిఖిల్ సిద్ధార్థ, సాయి దుర్గా తేజ్, నవీన్ పోలి శెట్టి, అడవి శేషు, అఖిల్, కళ్యాణ్ రామ్… ఇలా టైర్ 2లో పోటీ మామూలుగా లేదు.
టైర్ 2లో టాప్ హీరోగా కనిపించిన విజయ్ దేవరకొండ, స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేసిన తప్పులు, పొరపాట్లు అతని క్రేజ్‌ని అమాంతం పడేశాయి. రిజల్ట్ ‘ది ఫ్యామిలీ స్టార్’ విషయంలో స్పష్టంగా కనిపించింది. ‘ఖుషీ’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా, బ్రేక్ ఈవెన్ కాలేదు. తాజాగా ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీని యూత్ పట్టించుకోకపోవడంతో డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది.
Ambati Rambabu : పవన్ కళ్యాణ్ కూడా నాలా డ్యాన్స్ చేయలేడు..
రామ్ పోతినేని కూడా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ ‘ది వారియర్’, ‘స్కంద’ రూపంలో డబుల్ డిజాస్టర్లు ఫేస్ చేస్తాడు. ఇదే సమయంలో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తమ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో వేరియేషన్స్ చూపించారు. సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వైర్’ మూవీ 6 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసేసింది. ఈ రేంజ్ వసూళ్లు అస్సలు ఊహించలేదు. ‘ది ఫ్యామిలీ స్టార్’ రెండో రోజు వసూళ్ల కంటే, ‘టిల్లు స్క్వైర్’ 8వ రోజు వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి.
విశ్వక్ సేన్ కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. 2021లో వచ్చిన ‘పాగల్’ రూ.6 కోట్లు రాబడితే, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’ సినిమాలు రూ.20 కోట్లకు పైగా రాబట్టాయి. మూడేళ్లలోనే విశ్వక్ సేన్ మార్కెట్ 3 రెట్లు పెరిగింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే రూ.30 కోట్లు రావడం పక్కా.. ఇక్కడ విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని క్రేజ్, మార్కెట్ తగ్గడానికి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ మార్కెట్ పెరగడానికి వారి స్క్రిప్ట్ సెలక్షనే కారణం..
Family Star Review : ఎమోషనల్ మిడిల్ క్లాస్ మ్యాన్..