Thrinadha Swami Vratha Katha : త్రినాథ వ్రతం పురాతన కాలం నుంచి మన హిందువులు జరుపుకొనే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులును త్రినాథులు పిలుస్తారు. అనగా త్రిమూర్తులుగా కొలుస్తారు.
మనం చేసే ఎలాంటి వ్రతాలైన పేద మధ్యతరగతి కుటుంబం వాళ్లు కూడా చేసుకునే విధంగా ఉంటాయి. అలాంటిదే ఈ త్రినాధుని వ్రతం కూడా.. ఈ పూజకు ఎక్కువ నైవేద్యాలు పిండి వంటలు లేదా ప్రసాదాలు వాళ్లతో పనిలేదు. ముఖ్యంగా కావలసినవి అరటి పళ్ళు కొబ్బరికాయ పువ్వులు ఆకులు అంతే..
త్రిమూర్తులు వ్రత సామగ్రి :
* బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల చిత్ర పటం
* మామిడి ఆకులు – తోరణాలకి సరిపడ
* అరటిమొక్కలు – 2
* కొబ్బరికాయలు – 5
* పండ్లు – అరటి పళ్ళు (మిగతా ఏ రకాల ఫ్రూట్స్ అయినా మీ ఇష్టం, లేకపోయినా పరవాలేదు)
* పువ్వులు – మీకు అందుబాటులో ఉన్నన్ని
* పసుపు – 50 గ్రాములు
* కుంకుమ – 50 గ్రాములు
* గంధం – (చిన్న డబ్బా)
* హారతి కర్పూరం – (చిన్న ప్యాకెట్)
* అక్షింతలు – (కొంచెం)
* అగ్గిపెట్టె – 1
* అగరు వత్తులు – 10
* కలశ చెంబులు (3) లేదా (6) లేదా (9)
* మర్రి ఆకులు (9-18)
* గంజాయి ( కొంచెం కంపల్సరీ గంజాయి మాత్రం ఉండాల్సిందే ఈ పూజకి అదే ముఖ్యం)
* తోరములు (తెల్లని దారానికి పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసి సహిత విష్ణునికి పూజచేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు)
* ప్రత్యేక నివేదన (పిండి వంటలు)
సంక్షిప్తంగా వ్రత శ్లోకం
మార్చు
ప్రార్థన
మార్చు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహాః
ఓం నారాయణాయ స్వాహాః
ఓం మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను) తరువాత దీపారాధన మొదలుపెట్టి ఇంకా కథలోకి వెళ్దాము..