Tholi Ekadashi : ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ద ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి” అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహవిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు. గనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు (24) ఏకాదశులు వస్తాయి. చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకొకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. ఈ యోగ నిద్ర ద్వారా భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనగా చెబుతారు. తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. మహావిష్ణువుకు అలాగే విష్ణు అవతార దేవతలకు చాలా ప్రీతికరమైన తిథి ఏకాదశి. ఈ ఏకాదశి రోజునైనా వైష్ణవులు విష్ణువును అలాగే విష్ణు అవతార దేవుళ్ళను ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ఇంక తొలి ఏకాదశి రోజైతే చెప్పనవసరం లేదు. తొలి ఏకాదశి రోజు మహా విష్ణువునకు ఎంతో ముఖ్యమైన రోజు. శివునికి శివరాత్రి ఎంత ముఖ్యమో, విష్ణువుకు తొలి ఏకాదశి అంత ముఖ్యం. ఈ తొలి ఏకాదశి చాలా విశిష్టమైన పవిత్రమైన తిథి. ఈ రోజు లక్ష్మీసమేత విష్ణువును, విష్ణు అవతార దేవతలు వెంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి, కృష్ణుడు రాముడు మొదలగు దేవతలకు చేసే ఉపవాస పూజలు మనకు ఉన్న సమస్యలను దూరం చేయడంతో పాటు మంచి ఆరోగ్య, సుఖసంతోషాలతో పాటు లక్ష్మీ ఆశీస్సులు లభిస్తాయి.
Kalki 2898AD Movie Twist : గాంఢీవం ఎత్తిన సుప్రీమ్ యాస్కిన్, అర్జునుడి రూపమా? ఇదేం ట్విస్టురా బాబూ..
తొలిఏకాదశి ఉపవాసం ముందురోజైన దశమి నుండే మొదలౌతుంది. దశమి రోజు రాత్రి నుండే ఉపవాసదీక్ష మొదలు పెడతారు. ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి శ్రీహరిని పూజించాలి. తొలి ఏకాదశి రాత్రి జాగారము చేస్తే అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కతుందని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజున బ్రహ్మచర్యం ఆచరిస్తూ.. అసత్యమాడకుండా ఉండాలి, అలాగే స్త్రీ సంగమమునకు కూడా దూరంగా ఉండాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.