Thammudu Re Release : ఫుల్లు జోష్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..

Thammudu Re Release : ఏపీ ఎలక్షన్స్‌లో 100 శాతం సక్సెస్ రేటు సాధించింది జనసేన. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్, 21 స్థానాల్లో నిలబెట్టిన తన అభ్యర్థులను గెలిపించుకున్నాడు. ఏపీ ఎన్నికల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా మారిన పవన్ కళ్యాణ్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ‘తుఫాన్’ అంటూ పొగడడం కూడా ఫ్యాన్స్ మరిచిపోలేరు. పదేళ్ల పోరాటం తర్వాత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్‌ జోష్ అభిమానుల్లో ఫుల్లుగా నిండింది.

Tollywood Heros Tags : హీరోలకు ‘స్టార్’ ట్యాగ్‌ల పిచ్చి.. ఆఖరికి శర్వానంద్ కూడా తగిలించుకున్నాడుగా..

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాని రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 12న ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం జరగాల్సింది. అయితే ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు ఆకస్మిక మరణంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది. ఈలోపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో జోష్ మరింత పెంచేందుకు జూన్ 14న థియేటర్లలోకి ‘తమ్ముడు’ సినిమాని తిరిగి తీసుకురాబోతున్నారు.

Tollywood : తెలుగు సినిమాకు ‘టాలీవుడ్’ అనే పేరు ఎలా వచ్చింది..!?

1999లో అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘తమ్ముడు’ మూవీలో ప్రితీ జింగానీ, అదితి హీరోయిన్లుగా నటించారు. ఆలీ కామెడీ, తండ్రి సెంటిమెంట్‌ బాగా వర్కవుట్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో కిక్ బాక్సింగ్‌ చేయడంతో చాలామంది పవన్ కళ్యాణ్ అప్పట్లో ఈ బాక్సింగ్ నేర్చుకోవడానికి బాగానే ఖర్చు పెట్టారు. రమణ గోగుల మ్యూజిక్ అందించిన ‘తమ్ముడు’ సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచాడు. జనసేన విజయంతో హైలో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోష్‌ని నిర్మాతలు క్యాష్ చేసుకోవడం ఖాయం.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post