Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. నవంబర్ 28తో అన్ని రకాల ప్రచార కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పడింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి రకరకాలుగా ప్రలోభపెట్టడానికి దారులు వెతుక్కుంటున్నాయి పొలిటికల్ పార్టీలు.
నోటాకు ఓటేస్తే.. ప్రయోజనం ఏంటి..!?
చాలా నియోజిక వర్గాల్లో వాచీలను పంచుతున్నారు. గోడ వాచ్ ఖరీదు మహా అయితే రూ.300 ఉంటుంది. వాటికే ఆశపడి ఓట్లు వేస్తారా? అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు గుట్టు దాగి ఉంది. వాచీల వెనకాల కరెన్సీ నోట్లు దాచి పెట్టి ఇస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి ఓటుకి రూ.1000 నుంచి రూ.2 వేల వరకూ వాచీలో కరెన్సీ నోట్లు ఉంటున్నట్టు సమాచారం.
క్రిమినల్ కేసులు ఉంటేనే ఎమ్మెల్యే సీటు! బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగం మంది..
అలాగే మహిళా ఓటర్ల కోసం చీరలు, యువకుల కోసం క్రికెట్ కిట్స్ కూడా పంపిణీ అవుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి భారీగా ఖర్చు చేస్తోంది. కొన్ని నియోజిక వర్గాల్లో బీజేపీ కూడా తగ్గేదేలే! అంటోంది. మిగిలిన పార్టీల వాళ్లు కూడా తామేం తక్కువ తిన్నామా? అంటూ మద్యాన్ని పంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పంపకాలు పబ్లిక్‌గా జరుగుతుంటే, హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా జరుగుతున్నాయి.